News
News
X

Optical Illusion: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది

ఆప్టికల్ ఇల్యూషన్లంటే ఇష్టమే. అయిదే ఓసారి కింద ఇచ్చిన బొమ్మని చూడండి.

FOLLOW US: 

ఆప్టికల్ ఇల్యూషన్లు ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆధునిక చిత్రకారులు వేసిన చిత్రాలు అవన్నీ. అయితే వాటన్నింటిలో పురాతన మైనది ఒకటుంది. దాని వయసు 900 ఏళ్లు. ఇక్కడిచ్చిన చిత్రం దానిదే. దీన్ని తమిళనాడులోని తంజావూరులోని ఐరావతేశ్వర గుడి గోడలపై దీన్ని గుర్తించారు. ఈ గుడి వయసు 900 ఏళ్లు అని అంచనా. అంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ వయసు కూడా అదే. ఆ ఆలయం గోడలపై చోళుల శిల్పాకళా చాతుర్యానికి ప్రతీకలా నిలిచింది ఈ ఆప్టికల్ ఇల్యూషన్. 12 వ శతాబ్ధపు శిల్పకళకు ఇవి ప్రతీకలుగా మిగిలాయి. 

రెండు జంతువులు...
ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు రెండు జంతువులు ఉన్నాయి. అవి ఒకటి ఎద్దు, రెండో ఏనుగు. ఈ రెండింటికీ హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఏనుగు లేదా ఐరావతం ఇంద్రుని వాహనం కాగా, ఎద్దు లేదా నంది శివుని వాహనంగా వెలిశాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఈ రెండు జంతువులు కలిసి ఉన్నాయి. మొదటిసారి చూడగానే కొందరికి ఎద్దు వెంటనే కనిపిస్తుంది. మరికొందరికి ఏనుగు స్పూరిస్తుంది. ఎద్దు కొమ్ములు, ఏనుగు దంతాలుగా మారినట్టు కనిపిస్తాయి. కళ్లు మాత్రం రెండింటికీ కామన్ గానే ఉన్నాయి. 

మీకు ఏం కనిపిస్తుంది?
ఎద్దు, ఏనుగు ఈ రెండూ ఉన్నాయని మేమే చెప్పేశాం. అయితే ఇక్కడ ప్రశ్న ఆ రెండింటిలో మీకు మొదట ఏ జంతువు కనిపిస్తోంది. ఈ కన్ను, మెదడు సమన్వయంగా పనిచేసి ఏ జంతువును మొదట గుర్తించాయి? దీన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. 

ఎద్దు కనిపిస్తే...
మీకు ఈ చిత్రాన్ని చూడగానే మొదట ఎద్దు కనిపిస్తే మీరు చాలా నిజాయితీగా ఉంటారని అర్థం. అంతేకాదు నమ్మకాలు కూడా ఎక్కువ. మహామొండివారు, పాజిటివ్ గా ఆలోచిస్తారు. శక్తిమంతంగా ఉంటారు. 

ఏనుగు కనిపిస్తే...
మీకు ఏనుగు మొదట కనిపిస్తే చాలా కామ్‌గా, దయగా, ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటారని అర్థం. అలాగే మేధావులు కూడా.  ఏనుగు కనిపించిన వారి వ్యక్తిత్వం చాలా నెమ్మదిగా ఉంటుంది.

మీరు ఈ పురాతన ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా ఎలాంటి వ్యక్తిత్వం కలవారో నిర్ణయించుకోండి.  

Also read: మంటల్లో కాలే పిజ్జా, ఓవెన్లోనే కాదు ఇలా కూడా వండొచ్చు

Also read: మటన్‌తో కీమా ముట్టీలు, చల్లని సాయంత్రం వేడిగా తింటే ఆ మజాయే వేరు

Also read: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు

Published at : 30 Jun 2022 01:10 PM (IST) Tags: Optical Illusion in Telugu Interesting Optical Illusion Oldest Optical Illusion Optical Illusion on Temple wall

సంబంధిత కథనాలు

Sweet Recipe: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా

Sweet Recipe: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా

Pregnancy: గర్భం ధరించాక శృంగారం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Pregnancy: గర్భం ధరించాక శృంగారం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Beauty Tips: మెరిసే చర్మం కోసం రోజూ వీటిని తాగండి చాలు, మెరిసే రంగు రూపం సొంతమైపోతుంది

Beauty Tips: మెరిసే చర్మం కోసం రోజూ వీటిని తాగండి చాలు, మెరిసే రంగు రూపం సొంతమైపోతుంది

ఈ అయిదు ఆహారాలు తింటే చాలు, దంతాలు తెల్లగా మెరుస్తాయి

ఈ అయిదు ఆహారాలు తింటే చాలు, దంతాలు తెల్లగా మెరుస్తాయి

మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు

మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!