Wood fire Pizza: మంటల్లో కాలే పిజ్జా, ఓవెన్లోనే కాదు ఇలా కూడా చేయొచ్చు
పిజ్జా అంటే చెవి కోసుకునే బ్యాచ్ ఎంతో మంది. వారికోసమే ఈ మంటల్లో కాలే పిజ్జా.
పిజ్జాను ఓవెన్లో వండుతారు. ఓవెన్లో పెట్టిన పావుగంటలో పిజ్జా రెడీ అయి బయటికి వస్తుంది. ఇప్పుడు తాజా ఫుడ్ ట్రెండ్ ‘వుడ్ పైర్ పిజ్జా’. ఈ పద్ధతిలో పిజ్జా తయారీ ఓవెన్ పిజ్జాలానే ఉంటుంది. కాకపోతే దీన్ని మంటల్లో కాలుస్తారు. కొత్త రకమైన స్మోక్ వాసన,రుచి ఈ పిజ్జాకు వస్తుంది. అందుకే ఎక్కువ మందికి ఇప్పుడు ఈ వుడ్ ఫైర్ పిజ్జా నచ్చేస్తుంది. ఇలా ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ఆరగించేస్తున్నారు. భారతదేశానికి మాత్రం ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చింది.నిప్పులో కాల్చిన నాన్ రోటీలు ఇక్కడ ఫేమస్. ఇప్పుడు అదే విధంగా కాల్చే పిజ్జాలు కూడా వచ్చేశాయి. వీటి రుచి అందరి మనుసులు దోచేస్తుంది.
దీనికి గ్యాస్, ఓవెన్లు అవసరం లేకుండా ఇటుకలతో ఓ స్టవ్ లాంటివి కడతారు. చుట్టు ఇటుకలు పేర్చి మధ్యలో కలపతో మంట పెడతారు. ఆ కలప కాలి ఎర్రని బొగ్గులుగా మండుతూ లోపల చాలా వేడిగా ఉన్పప్పుడు ఈ పిజ్జాను లోపల పెడతారు. ఆ వేడికి పిజ్జా బాగా ఉడికిపోతుంది. అందుకే దీనికి స్మోకీ రుచి వస్తుంది. ఆ సువాసనే దీన్ని ప్రత్యేకంగా మార్చింది. నేరుగా మంటల మధ్యలో పెడితే మాత్రం పిజ్జా నల్లగా మాడిపోవడం ఖాయం. ఓవెన్ లాగే ఈ పొయ్యిలో కూడా చుట్టు అధిక వేడి తగిలేలా ఏర్పాట్లు చేస్తారు. పొయ్యి లోపల కాలి పోయిన చెక్క ముక్కలను పక్క జరిపి ఆ వేడి వాతావరణంలోనే ఈ పిజ్జాలు,నాన్ లు కాల్చేయచ్చు. పొయ్యి వేడెక్కాక కేవలం అయిదు నిమిషాల్లో పిజ్జా రెడీ అయిపోతుంది.
View this post on Instagram
View this post on Instagram