By: ABP Desam | Updated at : 20 Jan 2023 09:48 AM (IST)
Edited By: Bhavani
Representational image/pixabay
తిండి, పని, నిద్ర అన్నీసరిపడినంత ఉండాలి. ఇందులో ఏది తగ్గినా శారీరక మానసిక ఆరోగ్యాలు ముప్పులో పడతాయి. చాలా మంది తిండి, వర్కవుట్ కు ఇచ్చిన ప్రాధాన్యత విశ్రాంతి, నిద్రకు ఇవ్వరు. నిద్ర చాలా ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్లీప్ ఆంక్జైటీ ఎలా అనారోగ్యాలకు కారణం అవుతుందో తెలిపే కొత్త అధ్యయనాలు చాలా జరిగాయి. వాటి ఫలితాలలో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి.
యాభై ఏళ్లు పైబడిన ప్రతి పది మందిలో ఏడుగురు సరైన వేళకు నిద్రించకపోవడం వల్లే గుండెపోటు, స్ట్రోక్‌కు గురువ్వుతున్నారని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి సమర్పించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉన్నట్లయితే ఆ ముప్పు నుంచి బయటపడేవారని తేలింది. రాత్రి ఒక గంట నిద్ర తగ్గినా కూడా మెదడులోని సోషల్ బిహేవియర్ ను కంట్రోల్ చేసే భాగం ప్రభావతం అయ్యి చాలా స్వార్థంగా, చికాకుగా ప్రవర్తించే విధంగా మారుస్తుందని కాలిఫోర్నియా యూనివర్శిటీ వెల్లడించింది.
నిద్రలేమిని ఇన్సోమ్నియా అంటారు. రాత్రి నిద్ర పోవడానికి కష్టపడడం, రాత్రి నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఉదయాన్నే నిద్ర లేవడానికి కష్ట పడటాన్ని ఇన్సోమ్నియా అంటారు. రాత్రి నిద్రకు ఉపక్రమించిన తర్వాత కూడా చాలా సేపు మెలకువగానే ఉండిపోవడం, రాత్రి పూట చాలా సార్లు నిద్రాభంగం కలిగి ఎక్కువ సార్లు మెలుకోవడం, ఉదయం నిద్ర లేవగానే తాజాగా, ఉత్సాహంగా ఉన్న ఫీలింగ్ కలగపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలసటగా ఉన్నప్పటికీ పగటి పూట కూడా నిద్ర పోవడం కష్టంగా ఉంటుంది. నిద్ర చాలక పోవడం వల్ల ఏకాగ్రత తగ్గడం, చికాకుగా ఉండవచ్చు. కొంత మందిలో అప్పుడప్పుడు ఈ నిద్ర లేమి సమస్య వస్తుంది. దానంతట అదే పోతుంది కూడా. కొంత మందిలో అది నెలలు, సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.
ప్రతి సారి నిద్రలేమికి స్పష్టమైన కారణాలు చెప్పడం వీలుకాదు. అయితే ఒత్తిడి, ఆందోళన సాధారణంగా నిద్రలేమికి కారణమవుతాయి. పడక సరిగా కుదరక పోవడం, కదిలినపుడు మంచం శబ్ధం చెయ్యడం వంటి చిన్న చిన్న కారణాలు కూడా నిద్రాభంగం కలిగించవచ్చు. కొన్ని సార్లు ప్రయాణాలు, జెట్ లాగ్, షిఫ్ట్‌ల్లో పనిచెయ్యడం కూడా నిద్రకు అంతరాయంగా మారుతాయి. ఇవే కాదు శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా నిద్ర లేమికి కారణం అవుతాయి.
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్