Sleep Gadgets : నిద్ర పట్టడం లేదా? ఈ గ్యాడ్జెట్స్ ప్రయత్నించండి, హాయిగా నిద్రపోతారు
Sleep Gadgets : మంచి నిద్ర అంటే మంచి ఆరోగ్యం అని అర్థం. నిద్రలోనే సగం రోగాలు నయం అవుతాయంటుంటారు. సరైన నిద్రలేకుంటే చాలా రోగాలు వస్తాయి. అయితే చాలా మంది నిద్ర సరిగ్గ రాక ఇబ్బందులు పడుతుంటారు.
![Sleep Gadgets : నిద్ర పట్టడం లేదా? ఈ గ్యాడ్జెట్స్ ప్రయత్నించండి, హాయిగా నిద్రపోతారు If you can't sleep or not, you can sleep peacefully if you use these gadgets Sleep Gadgets : నిద్ర పట్టడం లేదా? ఈ గ్యాడ్జెట్స్ ప్రయత్నించండి, హాయిగా నిద్రపోతారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/faea5950425706a97005f557bbdc23351706985978591880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sleep Gadgets : రాత్రి ప్రశాంతంగా పడుకుంటే.. మెరుగైన నిద్ర మిమ్మల్ని రోజంతా రిఫ్రెష్ గా ఉంచుతుంది. మంచి నిద్ర ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకు సంకేతం. చాలా మంది రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. మెరుగైన నిద్ర కావాలనుకుంటే.. కొన్ని ముఖ్యమైన చిట్కాలను కచ్చితంగా పాటించాలి. చీకటి గది, సౌకర్యవంతమైన పరుపు, దిండు, చల్లని వాతావరణం ప్రశాంతమైన నిద్రకు సహాకరిస్తాయి. అంతేకాదు వీటితోపాటు మీరు గాఢనిద్రలోకి వెళ్లేందుకు కొన్ని ఉపకరణాలు, గాడ్జెట్లు సహాకరిస్తాయి. అవేంటో చూద్దాం.
ఇయర్ ప్లగ్‌లు :
ఈ చిన్న పరికరాలు శబ్దాన్ని తగ్గించడం ద్వారా మీరు ప్రశాంతంగా నిద్రించేందుకు సహాకరిస్తాయి. ఎక్కువ సేపు నిద్రపోవడానికి మీకు సహాయపడతాయి. మీ భాగస్వామికి గురకపెట్టే అలవాటు ఉంటే.. లేదంటే చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలు, ట్రాఫిక్ గోలను తగ్గించుకోవాలంటే ఇయర్ ప్లగ్ లు ఉపయోగపడతాయి.
వైట్ నాయిస్ ప్లేయర్ :
రాత్రి పడుకునేముందు రకరకాల శబ్దాలు మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. ఆ శబ్దాల నుంచి మీ నిద్రను కాపాడుకోవాలంటే వైట్ నాయిస్ ప్లేయర్ బెస్ట్ ఆప్షన్.
ఇది బయటి శబ్దాన్ని బఫర్ చేయడం ద్వారా మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది.
ఐ మాస్క్ :
మనలో చాలా మందికి వెలుతురు ఉంటే సరిగ్గా నిద్రపట్టదు. అలాంటివారు నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సిల్క్ ఐ మాస్క్ లేదా జెల్ ఐ మాస్క్‌ని పడుకునే వరకు ధరించండి. అలా చేయడం వల్ల వెలుతురు తగ్గి మీరు నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఐ మాస్క్‌ల ద్వారా వర్తించే సున్నితమైన ఒత్తిడి మిమ్మల్ని మరింత ప్రశాంతంగా నిద్రించడంలో సహాయపడుతుంది.
యాంటీ-స్నోర్ డివైజులు:
మీ భాగస్వామి పెట్టే గురక వల్ల మీకు నిద్ర పట్టడం లేదా? అయితే మీకోసం యాంటీ స్నోర్ పరికరాలు అందుబాటులోఉన్నాయి. వీటిద్వారా మీరు ప్రశాంతంగా నిద్రించవచ్చు. గురక లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు అవసరమైన చిట్కాలతో వివిధ రకాల క్లిప్‌లు, స్టిక్కర్‌లు మార్కెట్లో అందుబాటులోఉన్నాయి.
బరువున్న బ్లాంకెట్ :
కొన్ని దుప్పట్లు సాధారణ దుప్పట్ల కంటే బరువుగా ఉంటాయి. ఇవి ప్రశాంతంగా నిద్రించేందుకు సహాయపడతాయి. బరువున్న దుప్పటి ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను శాంత పరుస్తుంది. సౌకర్యాన్ని కలిగించి.. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మసాజర్స్ :
నెక్ మసాజర్ దిండ్లు, బాడీ మసాజర్‌లు, ఫుట్ మసాజర్‌లు మొదలైనవి మీ మనస్సును, శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. వీటిలో ఏదైనా ఒక గ్యాడ్జెట్‌ను ఈ రోజే కొనుగోలు చేసి ట్రై చెయ్యండి. హాయిగా నిద్రపోండి.
Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)