News
News
వీడియోలు ఆటలు
X

Sleep: రాత్రిపూట ఈ ఆహారాలకు దూరంగా ఉంటే చంటి పిల్లల్లా హాయిగా నిద్రపోవచ్చు

కొన్ని రకాల ఆహారాలు నిద్ర పట్టకుండా చేస్తాయి. అలాంటి వాటిని దూరంగా పెట్టాలి.

FOLLOW US: 
Share:

మంచి ఆరోగ్యానికి సమతుల ఆహారంతో పాటు తగినంత నిద్ర ముఖ్యం. సంపూర్ణమైన నిద్రను పొందే వ్యక్తి ఇతర వ్యక్తుల కంటే ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే రోజూ రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రపోవాలని చెబుతారు.  చాలామందికి గాఢ నిద్ర పట్టదు. క్రమరహిత నిద్ర పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అంటే రెండు గంటలకు, మూడు గంటలకు ఒకసారి తెలివి వచ్చి, మళ్ళీ నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతూ నిద్రపోవడం. దీన్ని గాఢనిద్ర అని భావించరు. సంపూర్ణ నిద్ర అని కూడా పిలవరు. ఏడెనిమిది గంటలు తెలివి రాకుండా నిద్రపోతేనే శరీరానికి ఆరోగ్యం. అయితే ఇలా గాఢ నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆహారం. మీరు రాత్రిపూట తీసుకున్న ఆహారం, రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది.

కెఫిన్
కెఫిన్ ఉండే టీ, కాఫీలు రాత్రిపూట తాగకూడదు. ఐస్ క్రీమ్,  డిజర్ట్ లలో కూడా కెఫిన్ ఉంటుంది.  కొన్ని చాక్లెట్లలో కూడా ఈ కెఫీన్ లభిస్తుంది. కాబట్టి వీటిని సాయంత్రం ఏడు దాటాక తినకపోవడం మంచిది. ఇవన్నీ నిద్రను అడ్డుకుంటాయి.

ఆమ్ల ఆహారాలు
రాత్రిపూట పుల్లగా ఉండే ఆహారాలేవీ తినకూడదు. వీటిలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. అందుకే పుల్లటి పండ్ల రసాలు, పచ్చి ఉల్లిపాయలు, టమోటోతో వండిన వంటలు తినకూడదు. ఇవన్నీ ఎసిడిటీకి కారణం అవుతాయి. 

భారీ ఆహారాలు
రాత్రిపూట తేలిగ్గా ఉండే ఆహారమే తినాలి. భారీ ఆహారాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు. అందుకే రాత్రి పూట తేలికపాటి ఆహారాలను తీసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి.

ద్రవాహారాలు
రాత్రిపూట లిక్విడ్ డైట్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనకు పదేపదే లేవాల్సి వస్తుంది. అందుకే పుచ్చకాయ, దోసకాయ వంటివి రాత్రిపూట తినకూడదు. నీరు కూడా మితంగా తాగాలి. 

ఆల్కహాల్ 
ఆల్కహాల్ రాత్రి నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. నిద్రకు భంగం కలిగించే మొదటి ద్రావకం ఆల్కహాల్. 

నిద్ర తగ్గితే ఆ ప్రభావం పూర్తి శరీరంపై పడుతుంది. మెదడు కూడా సరిగా ఆలోచించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Also read: క్యాన్సర్, గుండె జబ్బులకు 2030 నాటికల్లా వ్యాక్సిన్లు, అలా జరిగితే స్వర్ణ యుగమే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 18 Apr 2023 06:43 AM (IST) Tags: Sleeping Night Sleep Avoid foods foods for sleep Sleeping Benefits

సంబంధిత కథనాలు

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్