అన్వేషించండి

Stress: ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నట్టే లెక్క

ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్. ఇది అధికంగా ఉత్పత్తి అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కార్టిసాల్... ఇదొక ఒత్తిడి హార్మోన్. మనకు కంగారు కలిగించే లేదా భయం కలిగించే సంఘటన జరిగినప్పుడు శరీరంలో సహజంగా ఏర్పడే ప్రతిస్పందనలో భాగంగా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ అంతర్నిర్మిత అలారం వ్యవస్థ లాంటిది. ఈ హార్మోన్ స్థాయిలు ఒకేలా ఉండవు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే అధికంగా ఈ  హార్మోన్ ఉత్పత్తి అవ్వడం అనేది మాత్రం చాలా ప్రమాదకరం.  కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. ముఖం ఉబ్బినట్టు అవుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు వస్తుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. మూడు స్వింగ్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. 

కాబట్టి కార్టిసాల్ హార్మోను అధికంగా ఉన్నట్టు అనిపిస్తే, ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువ నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడితో కూడిన ఆలోచనలకు దూరంగా ఉండాలి. శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. మీకు నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలి. శరీరంలో కార్టిసాల్ పూర్తిగా ఉత్పత్తి కాకపోయినా, అతి తక్కువగా ఉత్పత్తి అవుతున్నా కూడా ప్రమాదమే. అది రోజుకు ఎంత ఉత్పత్తి అవ్వాలో, ఆ స్థాయిలో అయితే మన ఆరోగ్యం బాగుంటుంది.

కార్టిసాల్ మన శరీరానికి చాలా రకాలుగా అవసరం. శరీరం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను ఉపయోగించుకోవడానికి కార్టిసాల్ సహకరిస్తుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శక్తిని పెంచి శరీరంలో సమతుల్యత ఉండేలా చూస్తుంది.  కాబట్టి కార్టిసాల్ పూర్తిగా విడుదలవ్వకపోయినా ప్రమాదమే. ఇది మితంగా ఉత్పత్తి అవ్వాల్సిందే.

ఒత్తిడి హార్మోను తగ్గించే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ఒత్తిడి తగ్గాలంటే సెరోటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసే ఆహారాలను కచ్చితంగా తినాలి. ముఖ్యంగా రోజూ అరటి పండ్లు, బాదం పప్పులు, పాలు, కోడి గుడ్లు, పప్పు ధాన్యాలు వంటివి అధికంగా తినాలి. ఆనంద హార్మోన్ అయిన ఎండార్ఫిన్ స్థాయిలను పెంచే ఆహారాలను కూడా తినాలి. ఇందుకోసం డార్క్ చాకొలెట్ రోజూ చిన్న ముక్క తినాలి. క్యాప్సికమ్ వంటలు అధికంగా తినాలి. పిల్లలతో సంతోషంగా గడపాలి. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధను వాడడం వల్ల కూడా ఒత్తిడి హార్మోను తగ్గుతుంది. 

Also read: నెలరోజుల పాటు నిల్వ ఉండేలా కరివేపాకు పచ్చడి రెసిపీ ఇదిగో

Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Alzheimers Diet : మాంసం తింటే జ్ఞాపకశక్తి పెరిగి, అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
మాంసం తింటే జ్ఞాపకశక్తి పెరిగి, అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Family Planning Operation : పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ మగవారు చేయించుకుంటే మంచిదా? లేక ఆడవారికా? నిపుణుల సలహాలు ఇవే
Car Wash at Home : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్​ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే
ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్​ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే
Daily 10-Minute Yoga : రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది
రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Venkatesh Nandamuri Kalyan Ram : వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
వెంకీ, కల్యాణ్ రామ్‌లతో అనిల్ మల్టీ స్టారర్ - హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ లిస్ట్
LPG Imports: చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
చైనాకు వెళ్లాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌ మళ్లాయి! ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి వస్తున్న ఎల్పీజీ కార్గో !
HMPV Symptoms: ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
ముక్కు దిబ్బడ ,గొంతు నొప్పి ఉందా? సాధారణ జలుబుగా పొరపాటు పడకండి! HMPV కావచ్చు! 
Embed widget