అన్వేషించండి

FSSAI : ఎక్స్పైరీ డేట్ 45 రోజుల కంటే తక్కువుంటే ఫుడ్ ఐటెమ్స్ సప్లై చేయొద్దట-FSSAI చెప్పిన విషయాలివే

FSSAI : ఆన్‌లైన్‌లో పనిచేస్తోన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లను కేవలం 45 రోజుల షెల్ఫ్ లైఫ్ ఉన్న వినియోగదారులకు ఆ ఆహార పదార్థాలను మాత్రమే డెలివరీ చేయాలని FSSAI కోరింది.

FSSAI : నేటి బిజీ లైఫ్‌లో సమయం లేక.. ఒకవేళ ఉన్నా వంట చేసే ఓపిక లేక చాలా మంది ఫుడ్ డెలివరీ యాప్స్, రెస్టారెంట్స్ పై ఆధారపడుతున్నారు. డబ్బు సంపాదించే ఆరాటంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీనిపై ఎంత మంది నిపుణలు హెచ్చరించినా.. పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. టైంకి తిన్నామా, టేస్టీగా ఉందా అనే ఆలోచిస్తున్నారు తప్ప దాని క్వాలిటీ గురించి ఆలోచించట్లేదు. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా అని ఈ మధ్య కాలంలో అనేక చోట్ల అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఈ తరహా ఘటనలు ఆగట్లేదు. ఈ సమయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు (FBOs) కీలక సూచనలు జారీ చేసింది. ఆహార వ్యాపార నిర్వాహకులు కనీసం 45 రోజుల షెల్ఫ్ లైఫ్.. అంటే ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆహార పదార్థాలను వినియోగదారులకు డెలివరీ చేయాలని FSSAI పేర్కొంది. దీనర్థమేమిటంటే.. గడువు తేదీ 45 రోజుల కంటే తక్కువగా ఉంటే సప్లై చేయవద్దన్నమాట. ఇది కాకుండా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు లేబులింగ్ అండ్ డిస్‌ప్లే నిబంధనలను సైతం అనుసరించాలని  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా ఆందోళనలను రేకిత్తిస్తోంది. బిర్యానీలో బళ్లులు, కీటకాలు వంటివి రావడం ఆహార ప్రియులను భయానికి గురి చేస్తోంది. దీంతో ఎప్పుడైనా ఆర్డర్ చేయాలనుకునే వారు ఆలోచించి మరీ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అందుకే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నపుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో, మీరు ఆర్డర్ చేసిన ఆహారం వినియోగానికి అనుకూలంగా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసినా పోయేదేం ఉండదు. అదే సమయంలో ఆ ఆహార పదార్ధం గడువు తేదీ 45 రోజుల కంటే తక్కువగా ఉంటే, దానిని తీసుకోవద్దు. వెంటనే మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారుల కోర్టులు, సంబంధిత ఫోరమ్‌లలో ఏటా 5 లక్షలకు పైగా ఫిర్యాదులు దాఖలవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కేసులు వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని చూపిస్తున్నాయి.

ఈ-జాగృతి పోర్టల్ ద్వారా కేసుల పరిష్కారం మరింత సులభతరం

చాలా మందికి తెలియని విషయమేమింటే.. ఇ-జాగృతి పోర్టల్‌తో కేసుల పరిష్కారం మరింత సులభం అవుతుంది. అందుకే వినియోగదారులు తమ హక్కుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆన్‌లైన్‌లో పనిచేస్తోన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లను (FBOs) షెల్ఫ్ లైఫ్ అంటే కనీసం 45 రోజుల గడువు ఉన్న వినియోగదారులకు మాత్రమే డెలివరీ చేయాలని కోరింది.

జొమాటోకు నోటీసులు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు అందాయి .వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు కంపెనీకి వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జొమాటో కంపెనీ తెలిపింది.

Also Read : బరువు తగ్గేందుకు బొప్పాయిని పరగడుపునే తినాలట.. మరిన్నో బెనిఫిట్స్ కూడా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget