అన్వేషించండి

Heart Attack and CPR: ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ఇలా చేయండి, ప్రాణం కాపాడినట్టే

ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు దాడి చేస్తుంది.

హఠాత్తుగా గుండె ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇలా గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. గుండె జబ్బుల వల్ల గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల, ఎలక్ట్రిక్ షాక్ వల్ల, భయం వల్ల, కొలెస్ట్రాల్ అతిగా పేరుకుపోవడం వల్ల రకరకాల కారణాలతో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎదుట వ్యక్తి గుండె ఆగి పడిపోయినప్పుడు, పక్కవాళ్ళు చేసే ప్రాథమిక చికిత్స ఆ వ్యక్తిని తిరిగి కాపాడే అవకాశం ఉంది. దీన్నే కార్డియో పల్మనరీ రెససిటేషన్ అంటారు. దీన్నే CPR అంటారు. ప్రతి ఒక్కరికి సిపిఆర్ ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులకైనా, స్నేహితులకైనా, రోడ్డు మీద పోయే ఏ వ్యక్తులైనా గుండెపోటుతో పడిపోతే వారికి సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.

ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. బిగుతైన దుస్తులు వేసుకుంటే వాటిని విప్పేయాలి. 

పక్కనున్న వారిని 108కి ఫోన్ చేయమని చెప్పాలి. మీరు మోకాళ్ళ మీద కూర్చొని ఆ వ్యక్తి ఛాతీ మీద ఒక చెయ్యి మీద మరొక చెయ్యి పెట్టి ఫోటోలో చూపించిన విధంగా ఒక చేతి వేళ్లతో మరొక చేతి వేళ్లను పట్టుకుని...  ఛాతీ మధ్యలో నొక్కుతూ ఉండాలి.చాలా వేగంగా... మన శరీరం బరువు మొత్తం ఆ చేతి మీద పడేలాగా నొక్కుతూ ఉండాలి. నిమిషానికి కనీసం వంద సార్లు వేగంగా నొక్కాలి. వీటిని చెస్ట్ కంప్రెషన్స్ అంటారు. ఇలా నొక్కడం వల్ల తిరిగి గుండె కొట్టుకునే అవకాశం ఉంది. మధ్యమధ్యలో నోటిలోకి గాలిని ఊదుతూ ఉండాలి. గాలిని ఊదినప్పుడు నోటిలో, నోరు పెట్టడం కష్టం అనుకుంటే... పలుచటి రుమాలు అతని నోటిపై పెట్టి, గట్టిగా గాలి ఊదండి. ఇలా చేసి మళ్లీ గాలి ఊదండి. గుండె కొట్టుకోవడం మొదలై,  ఆయన ఊపిరి తీసుకునే వరకు ఇలా సిపిఆర్ చేయడం అవసరం. కొందరు ఈ సిపిఆర్ ద్వారా తిరిగి కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ లోపు అంబులెన్స్ వస్తే వారు మిగతా జాగ్రత్తలు తీసుకుంటారు.

Also read: సిఫిలిస్, ఇదొక లైంగిక వ్యాధి- దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే

Also read: అమ్మో టమోటాలు, ఒకప్పుడు వీటిని తినాలంటే వణికిపోయేవారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Castor Oil on Navel : బొడ్డుపై ఆముదం ఇలా అప్లై చేయండి.. రోజూ రాస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
బొడ్డుపై ఆముదం ఇలా అప్లై చేయండి.. రోజూ రాస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Barley Soup : బరువు, కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటున్నారా? అయితే బార్లీ సూప్‌ ట్రై చేయండి, రోజూ తింటే కలిగే లాభాలివే
బరువు, కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటున్నారా? అయితే బార్లీ సూప్‌ ట్రై చేయండి, రోజూ తింటే కలిగే లాభాలివే
Typhoid Diet : టైఫాయిడ్ వస్తే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఇవే.. జ్వరం తగ్గిన తర్వాత రికవరీ కోసం ఇవి తినండి
టైఫాయిడ్ వస్తే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఇవే.. జ్వరం తగ్గిన తర్వాత రికవరీ కోసం ఇవి తినండి
Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
AP Panchayat Elections Phase 1: ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
Embed widget