అన్వేషించండి

Tomatoes: అమ్మో టమోటాలు, ఒకప్పుడు వీటిని తినాలంటే వణికిపోయేవారు

ఇప్పుడు టమోటాలు ధర పెరిగిపోవడంతో కొంతమంది వాటిని కొనలేకపోతున్నారు.

ఏ కూర వండినా, అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. ఇక బిర్యానీలు, పులావులు అయితే టమోటా కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కిలో 200 రూపాయలు దాకా చేరుకోవడంతో ఎంతోమంది టమోటాలు కొనలేని పరిస్థితి వచ్చింది. టమోటో కూర అంటే ధనవంతుల కూరగా మారిపోయింది. ఇప్పుడంటే టమోటాల కోసం విలవిలలాడిపోతున్నారు. కానీ ఒకప్పుడు వీటిని తినాలంటేనే మునిగి పోయేవారు.

టమోటాలు ఎక్కడ పుట్టాయో చెప్పడం చాలా కష్టం, కానీ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో వాటిని మొదటిసారి పండించారని అంటారు. చిలీ, బొలీవియా వంటి దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో టమోటాలు మొదటగా పండాయని అంటారు. క్రీస్తుశకం 700లోనే టమోటోలు పండినట్టు ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఆ టమోటోలు మొదట్లో చాలా చేదుగా ఉండేవని, వాటిని తినేందుకు ఎంతోమంది భయపడేవారు అని అంటారు. కాలం గడుస్తున్న కొద్దీ వీటి రుచి కూడా మారుతూ వచ్చిందని చెబుతారు. టమోటాల రుచి మారాక, ప్రపంచ నావికుడైన క్రిస్టోఫర్ కొలంబస్ ఈ టమోటోలను యూరోపియన్లకు పరిచయం చేశాడని అంటారు. అప్పటినుంచి యూరోప్‌లో కూడా టమోటాలను పండించడం మొదలుపెట్టారని చెబుతారు. ఒకప్పుడు టమోటాలను విషపూరితమైనవిగా చూసేవారు. వాటిని తినేవారు కాదు. మొక్కలను పీకి పడేసేవారు. అమెరికాలో కూడా ఇలాంటి సందేహాలే ఉండేవి. ఈ సందేహాలు అన్ని 19వ శతాబ్దంలో బద్దలైపోయాయి. టమోటో లేని వంట ఇప్పుడు లేదు. ఒకప్పుడు పాయిజన్ ఆపిల్‌గా పిలిచిన టమోటో ఇప్పుడు అత్యవసరమైన కూరగా మారిపోయింది.

అయితే మన దేశానికి మాత్రం టమోటోలను పరిచయం చేసింది పోర్చుగీసు వారని అంటారు. టమోటాలతో పాటు మొక్కజొన్న, జీడిపప్పు, క్యాప్సికం, అవకాడో వంటి పంటలను పోర్చుగీసు వారే తమతో పాటు భారత్‌కి తెచ్చారని చెబుతున్నారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు టమోటా పండడానికి సరిగ్గా సరిపోతాయి. భారత నేలల్లో టమోటాలు విరగ కాస్తాయి. దానివల్ల ఇప్పుడు టమోటోలు ప్రధాన పంటగా మారిపోయాయి. దీని పుల్లని రుచి అందరికీ నచ్చింది. ఇప్పుడు టమోటో లేని ఆహారం ఊహించుకోవడమే కష్టంగా మారిపోయింది. దీంతో చేసే టమోటో సాస్ ప్రపంచ ప్రఖ్యాత వంటకంగా పేరు తెచ్చుకుంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు టమోటా సాస్ ఉండడం కచ్చితంగా అయిపోయింది. టమోటా తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడంతో అందరూ టమోటోకు అభిమానులు అయిపోయారు. ఇప్పుడు టమోటాలు మోస్ట్ వాంటెడ్ ఆహారంగా మారిపోయింది.

Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్

Also read: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget