Wife and Husband fight: ‘భార్యతో ఉండలేను.. నన్ను జైల్లో పెట్టండి’.. ఓ భర్త ఆవేదన, ఊహించని ట్విస్ట్..
ఎవరైనా జైలుకు వెళ్లాలంటే భయపడతారు. కానీ, అతడు మాత్రం ఇంటికి వెళ్లాలంటే భయపడుతున్నాడు. చివరికి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనను జైల్లో ఉంచండని కోరాడు. మరి పోలీసులు ఏం చేశారు?
ఇల్లు కంటే జైలు పదిలం అంటున్నాడు ఆ భర్త. ఇంట్లో ఇల్లాలితో కలిసి జీవించడం కంటే.. కరుడగట్టిన నేరగాళ్లతో కలిసి ఉండటమే బెటర్ అంటూ.. పోలీసులను ఆశ్రయించాడు. జైలు కంటే ఘోరమైన ఆ ఇంట్లో ఉండబోనని, దయచేసి నన్ను కటకటాల్లో పెట్టేయండి అని పోలీసులను బతిమాలుకున్నాడు. మరి అతడి అభ్యర్థనను పోలీసులు మన్నించారా? చివరికి ఏమైంది?
రోమ్‌లోని గౌడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తాను భార్యతో కలిసి ఉండలేనని దయచేసి జైల్లో పెట్టండి అని పోలీసులను అభ్యర్థించాడు. ఈ విషయాన్ని టివోలికి చెందిన కారబినియరీ పోలీసులే స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘భార్య వేదింపులకు విసుగుచెంది అతడు ఆ ఇంటి నుంచి తనను బయటపడేయాలని అభ్యర్థించాడు’’ అని పోలీసులు తెలిపారు. అతడు అడిగినట్లే పోలీసులు ఆ భర్తను జైల్లో పెట్టారు. అదేంటీ ఏ కేసు లేకుండా అలా ఎలా జైల్లో పెట్టేస్తారనేగా మీ సందేహం. ఇందులో మీరు ఊహించని ఓ ట్విస్ట్ ఉంది.
టివోలీ కారబినియరీ కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ.. ‘‘జైల్లో ఉంటానని వచ్చిన వ్యక్తి.. మాదకద్రవ్యాల అక్రమ తరలింపు కేసులో నిందితుడు. అతడిని జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉంచాం. అతడు మరికొన్ని సంవత్సరాలు ఇంట్లోనే ఉండాలి. పోలీసుల అనుమతి లేనిదే బయటకు రాకూడదు. దీంతో అతడు కొన్నాళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. దానివల్ల అతడి భార్యకు, నిందితుడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకే అతడు గృహనిర్బంధం కంటే జైల్లో ఉండటమే బెటర్ అని మమ్మల్ని ఆశ్రయించాడు. ఇకపై జైల్లోనే ఉంటానని చెప్పాడు’’ అని తెలిపారు.
Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?
ఎంతటి నేరగాడైనా తన భార్య ముందు తోక జాడించడలేడని తెలుసుకున్న పోలీసులు.. గృహనిర్బంధాన్ని ఉల్లంఘించి బయటకు వచ్చినందుకు శిక్షగా అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొత్తానికి అతడు ఆ విధంగా తన భార్య నుంచి విముక్తి పొందాడు. ఈ ఏడాది జనవరిలో చైనాకు చెందిన ఓ వ్యక్తి.. కావాలనే నేరానికి పాల్పడి అరెస్టయ్యాడు. అతడి ప్రియురాలు పెళ్లి చేసుకుంటానని వేదించడమే ఇందుకు కారణం. తాను అరెస్టై జైలుకు వెళ్లినట్లయితే.. నేరగాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనని వదిలేస్తుందని భావించాడు. ఈ సందర్భంగా షాంఘైలోని ఓ డ్యాన్స్ స్టూడియో నుంచి బ్లూటూత్ స్పీకర్ దొంగిలించాడు. పోలీసులు అతడిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ‘‘నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకుంటానని అంటోంది. కానీ, నాకు ఇష్టం లేదు. మీరు నన్ను కనుగొని అరెస్టు చేస్తారని తెలుసు. కానీ, ఇంత త్వరగా పట్టుకుంటారని అనుకోలేదు’’ అని తెలిపాడు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!