అన్వేషించండి

Atukula Pulihora: పులిహోర కలిపేద్దాం, అటుకులతో ఇలా చేస్తే టేస్ట్ అదురుద్ది, పిల్లల లంచ్ బాక్స్‌కు ఈజీ రెసిపీ!

మీకు పులిహోర అంటే ఇష్టమా? అయితే, మీరు అటుకులతో కూడా ట్రై చేయొచ్చు. ఇదిగో ఇలా చేయండి.

పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే, పులిహోర చేయాలంటే ప్రత్యేకంగా అన్నం వండాలి. చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలిపాలి. అప్పుడే టేస్ట్ అదురుద్ది. కానీ, అదంతా టైమ్ టేకింగ్ అని అనుకుంటున్నారా? అయితే మీరు అటుకుల పులిహోరను ట్రై చేయండి. పిల్లలకు వేగంగా లంచ్ బాక్స్ సిద్ధం చేయాలంటే.. దీనికి మించిన మంచి రెసీపి మరొకటి ఉండదు. చాలా ఈజీగా కేవలం, 10 నుంచి 15 నిమిషాలలోపే అటుకుల పులిహోర కలిపేయొచ్చు. అదెలాగో చూడండి. 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, కరివేపాకు రెండు రెమ్మలు, కాస్త కొత్తిమీర (మీ పిల్లలకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి), రెండు నిమ్మకాయలు లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తగినంత ఉప్పు, కొన్ని వెల్లులి, అల్లం ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర, మూడు మిర్చీలు (పెద్దవైతే 2 చాలు), 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగలు లేదా పల్లీలు. 
 
ఇలా చేయండి: ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత వాటిని వడపోసి పక్కన పెట్టండి. ఎక్కువ తడి లేకుండా.. బాగా పొడిబారకుండా మధ్యస్థంగా ఉండేలా అటుకులు ఉండాలి. ఎక్కువ తడిగా ఉంటే వేడి చేసేప్పుడు మెత్తగా అయిపోతాయి. మరోవైపు స్టవ్ మీద పెనం పెట్టి, కాస్త ఆయిల్ వేసి అందులో వెల్లులి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశెనగ పల్లీలను సన్నని మంటపై దోరగా వేయించండి. కాస్త పసుపు వేసిన తర్వాత.. పక్కన పెట్టుకున్న అటుకులను పెనంలో వేసి బాగా కలపండి. అది స్టవ్ మీద వేడెక్కుతున్న సమయంలో.. నిమ్మరసాన్ని తీసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఆ రసాన్ని పెనం మీద ఉన్న అటుకుల్లో వేయండి. అంతే, అటుకుల పులిహోర రెడీ. స్టవ్ ఆపేసి.. అటుకుల పులిహోరను ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మరింత అందంగా కనిపిస్తుంది. 

మన అటుకుల పులిహోరను ఉత్తరాదిలో పోహా అంటారు. దీనికి టమోటాలు, బఠాణీలు, కాస్త మిక్చర్ కూడా యాడ్ చేస్తే పొహాగా మారిపోతుంది. మీకు టైమ్ ఉన్నట్లయితే.. నిమ్మరసానికి బదులుగా చింతపండు రసంతో కూడా అటుకుల పులిహోర చేయొచ్చు. ఇది నిమ్మరసం అటుకుల పులిహోర కంటే మాంచి టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజే అటుకుల పులిహోర ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇది కొత్తగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా అటుకుల ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అటుకులు డయాబెటిస్ బాధితులకు కూడా మంచివే. పైగా మీరు ఇందులో నిమ్మరసం కలుపుతారు కాబట్టి.. అటుకుల పులిహోర మరింత హెల్తీ. 

Also read: కుండ కొనండి, ఇంట్లోనే ఇలా కుండ బిర్యానీ చేయండి, ఇదిగో సింపుల్ రెసిపీ

Also read: తెలంగాణాలో జికా వైరస్, తేల్చిన ఆరోగ్య సంస్థ, ఇదెలా సోకుతుంది? లక్షణాలేంటి?

టాప్ హెడ్ లైన్స్

Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Embed widget