అన్వేషించండి

కాఫీ తాగితే, మద్యం మత్తు వదులుతుందా? శరీరంలో ఆల్కహాల్ ప్రభావం ఎంతసేపు ఉంటుంది?

ఈ మూడు విషయాల మీద మీద ఆల్కహాల్ ప్రభావం ఎంతనేది ఆధారపడి ఉంటుంది. శరీరం నుంచి గంటకు ఒక యూనిట్ చొప్పున వదిలిపోతుంది. ఇది అందరిలో ఒకేవిధంగా ఉండకపోవచ్చు.

ఆల్కహాల్ ప్రభావం అందరి మీద ఒకేవిధంగా ఉండదు. కొందరు ఎంత తాగినా చలించకుండా స్టడీగా ఉంటారు. మరి కొందరు కాస్త తాగగానే తలకెక్కి విపరీతంగా ప్రతి స్పందిస్తారు. మీరు స్టడీగా ఉంటే నెమ్మదిగా ఆల్కహాల్ ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది. కాఫీ తాగడం లేదా ఎక్కవ నీళ్లు తాగడం వల్ల హాంగోవర్ తగ్గుతుందని మీరనుకున్నట్టు జరగదు ఒక్కోసారి. బూజింగ్, డ్రైవింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి చర్చిద్దాం.

బూజింగ్ అండ్ డ్రైవింగ్ రెండూ కలిస్తే డెడ్లీ కాంబినేషన్ గా మారొచ్చు. అందుకే కాస్తే తాగాము వంటి స్టేట్మెంట్లు పనికిరావు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీరింగ్ వెనుక కూర్చోకూడదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. కొంత మందిలో అయితే రెండు రోజుల పాటు కూడా హ్యాంగోవర్ కొనసాగుతుందట. మరి కొన్ని సార్లు అసలు తాగిన ఆనవాల్లే ఉండకపోవచ్చట.

అసలు ఆల్కహాల్ ప్రభావం ఎంత సమయం పాటు కొనసాగుతుంది?

డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలను నివారించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. రక్తంలో కలిసిన ఆల్కహాల్ ఎంత సేపు శరీరం మీద ప్రభావం చూపుతుందనేది మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

  • ఎంత మొత్తంలో మీరు ఆల్కహాల్ తీసుకున్నారు
  • ఎంత సమయంలో మీరు అంత మొత్తం ఆల్కహాల్ తీసుకున్నారు
  • ఎంత త్వరగా మీ శరీరం దాన్ని వదిలించుకుంటుంది

శరరీ పరిమాణం, జెండర్, లివర్ కండిషన్, జీవక్రియల వేగం, మానసిక ఒత్తిడి ఇలా రకరకాల అంశాలు ఆల్కహాల్ మీద ప్రభావం చూపుతాయి. ఈ అన్ని అంశాలను గణించేందుకు ఎలాంటి ప్రమాణాలు మనకు అందుబాటులో లేవు. కనుక ఎంత తాగినా సరే తాగితే డ్రైవింగ్ పనికి రాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్ర పోతే అయిపోతుందా?

రాత్రి బూజింగ్ తర్వాత నిద్రపోతే తెల్లవారేటప్పటికి ఆల్కహాల్ ప్రభావం తగ్గిపోతుందనే బ్రమలో మనలో దాదాపు అందరూ ఉంటారు. నిద్రకు రక్తంలో కలిసిన ఆల్కహాల్ రేటుకు ఎలాంటి సంబంధం లేదు. నిద్ర పోయి లేచినంత మాత్రాన శరీరం మీద, మెదడు పనితీరు మీద ఆల్కహాల్ ప్రభావం తగ్గిపోతుందని అనుకోవద్దని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మోటరింగ్ పరిశోధకులు అంటున్నారు.

కాఫీ, నీళ్లు తాగితే త్వరగా దిగుతుందా?

తాగింది త్వరగా దిగిపోవడానికి అంటే.. శరీరం ఆల్కహాల్ ప్రభావం నుంచి విముక్తి పొందే సమయాన్ని కుదించేందుకు ఎలాంటి మార్గాలు లేవని డ్రింకావేర్ అనే స్వచ్ఛంద సంస్థ స్పష్టం చేస్తోంది. కప్పు కాఫీ తాగడం, చల్లని నీటితో స్నానం చెయ్యడం వంటివేవీ శరీరంలోని ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించవు. ఎంత సమయం పాటు శరీరం ఆల్కహాల్ ను రక్తంలో ఉంచుతుందో అంతసేపు కచ్చితంగా ఉండే తీరుతుంది. కేవలం సమయం గడపడం మినహా మరో మార్గమేది లేదనేది నిపుణుల వాదన.

తాగిన తర్వాత ఉదయం డ్రైవింగ్ చెయ్యొచ్చా?

శరీరంలో ఉండే కొద్ది మొత్తం ఆల్కహాల్ కూడా  డ్రైవింగ్ సామర్థ్యం మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. డ్రైవింగ్ చెయ్యాలని అనుకుంటే మద్యానికి దూరంగా ఉండడం మంచిదని పోలీసులు సలహా ఇస్తున్నారు. మీరు పొద్దున్న నిద్ర లేచే సమయానికి శరీరంలోని ఆల్కహాల్ ప్రభావం పూర్తిగా మాయం అవుతుందనే గ్యారెంటీ ఏదీ లేదు. కనుక మీ విజ్ఞత, విచక్షణ మీదే మీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

కాఫీ తాగడం వల్ల మీరు నిద్ర పోకుండా ఉండొచ్చు, నీళ్లు తాగడం వల్ల రీహైడ్రేట్ కావచ్చు ఇవి హ్యాంగోవర్ ను నివారించేందుకు తోడ్పడవచ్చు. కానీ శరీరంలో ఆల్కహాల్ ను మాత్రం తగ్గించలేవు. తెల్లవారిన తర్వాత హ్యాంగోవర్ తలనొప్పి లేకుండా ఉంవచ్చు అంతే. కాబట్టి, మధుప్రియులు.. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget