Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట
Side Effects of Smoking : అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. మీ సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆ ఒక్క అలవాటును వదిలేస్తే చాలు అంటున్నారు. ఇంతకీ అది ఏమి అలవాటు..?
![Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట How does smoking affect you personal life Tips to Improve Your Sex Life Sexual Health Tips : మెరుగైన లైంగిక జీవితం కోసం ఒక్క అలవాటు వదిలేస్తే చాలట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/18/9c5ccf737183712659c5ffc1d28a8d181700285600507874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Improve Your Sex Life : ప్రతి జంట తమ లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలనే కోరుకుంటుంది. తమ పార్టనర్‌తో పర్సనల్‌గా గడిపే ఆ స్పేస్‌లో హాయిగా.. ఇద్దరు ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే కొన్నిసార్లు వారి ఆశ నిరాశగా మారిపోతుంది. వివిధ కారణాల వల్ల వారి సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేని స్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఓ అలవాటు లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని ఓ అధ్యాయనం పేర్కొంది.
ఆ అలవాటు మరేదో కాదు ధూమపానం. చూసేందుకు ఫ్యాషన్‌గా, స్టైల్‌గా ఉంటుందని.. కొందరు స్మోకింగ్ (Smoking) చేస్తారు. కానీ దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజా అధ్యాయనం ప్రకారం.. స్మోకింగ్ అనేది సెక్స్లైఫ్పై దుష్ప్రభావాలను చూపిస్తుందని తేల్చింది. అందుకే ఈ అలవాటుకు చెక్ పెట్టాలి అంటున్నారు సెక్సాలజిస్టులు. పొగాకు తీసుకోవడం మానేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు.. లైంగిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు అంటున్నారు.
ఎందుకంటే పొగాకులోని నికోటిన్ ఒక బలమైన వాసోకాన్‌స్ట్రిక్టర్. ఇది రక్తనాళాలను తగ్గించి.. ధమనులు, సిరల నష్టానికి దారితీస్తుంది. దీనివల్ల పురషాంగంలోని చిన్న రక్తనాళాలు బాగా దెబ్బతింటాయి. ఇది మీ కలయిక సమయంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా స్పెర్మ్ డీఎన్ఏకి ఆక్సీకరణ నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల స్పెర్మ్ కౌంట్(Sperm Count) తగ్గడం.. స్పెర్మ్ చలనంలో మార్పులకు కారణమవుతుంది. కొందరిలో స్పెర్స్ కౌంట్ జీరో అయిపోతుంది. అంగస్తంభన, పురుషాంగంలో సమస్యలు ఏర్పడి.. సెక్స్ కోరిక తగ్గిపోతుంది.
స్మోకింగ్ అనేది కేవలం మగవారిలోనే దుష్ప్రభావాలు చూపిస్తుంది అనుకోకండి. ఇది మహిళల లైంగిక జీవితంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. స్మోకింగ్ చేసే మహిళల్లో అండాశయ నిల్వలు తగ్గుతాయి. అంతేకాకుండా యోనిని పొడిగా చేసి.. సెక్స్ సమయం(Sex Life)లో తీవ్రమైన బాధ, నొప్పిని కలిగిస్తాయి. ఇది స్త్రీలల్లో తక్కువ లిబిడోను కలిగిస్తుంది.
ధూమపానం మానేస్తే ప్రయోజనాలు ఏంటంటే..
స్మోకింగ్ మానేయడం వల్ల నిజంగానే లైంగిక జీవితం మెరుగుపడుతుందా? అనే ప్రశ్న మీలో ఉంటే.. దీనికి కచ్చితంగా ఎస్ అనే ఆన్సర్ ఇస్తున్నారు నిపుణులు. పొగాకు మానేయడం వల్ల లైంగిక ప్రేరేపణ పెరిగి.. మీరు బెడ్రూమ్లో ఎక్కువ సంతృప్తి పొందేలా చేస్తుంది. ధూమపానం చేయని పురుషులు, ధూమపానం చేసే వారితో పోలిస్తే.. రెండు రెట్లు ఎక్కువ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ధూమపానం మానేయడం వల్ల కలిగే మరొక బెనిఫిట్ ఏంటంటే.. ఇది పురుషుల్లో అంగస్తంభన సమస్యను దూరం చేస్తుంది. సిగరెట్లలో ఉండే నికోటిన్ రక్తనాళాల సంకోచానికి దారితీస్తుంది. ఇది అంగస్తంభనకు అవసరమైన రక్త ప్రవాహాన్ని అందిస్తుంది. అలాగే స్మోకింగ్ వల్ల మీరు కలయిక సమయంలో త్వరగా రన్ఔట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇది మీలోని శక్తిని 90 శాతం ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే శరీర సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. మీరు నిరంతరం స్మోకింగ్ చేసే వారైతే.. మీలో ఆ సత్తువ క్రమంగా తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ అలవాటును తగ్గించుకుంటే లిబిడోతో పాటు.. మీలో స్టామినా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
Also Read : ఈ సింపుల్ జపనీస్ ట్రిక్స్‌తో బరువు ఈజీగా తగ్గిపోవచ్చు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)