అన్వేషించండి

Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Christmas 2023: క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అయితే ఒక్కోదేశంలో ఒక్కోరకంగా ఈ వేడుకలు జరుగుతాయి.

How People Celebrate Christmas All Over the World: క్రిస్మస్ పండుగకు ప్రపంచం రెడీ అవుతోంది. ఈ నెల 25న క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ కు చాలా రోజుల ముందు నుంచే పండుగ సందడి షురూ అవుతుంది. క్రైస్తవులు తమ ఇళ్లను అందంగా ముస్తాబు చేసుకుంటారు. చర్చిలను అందంగా అలంకరిస్తారు. వెదురు కర్రలతో పాకను ఏర్పాటు చేసి, రంగుల కాగితాలను అంటిస్తారు. నక్షత్రాలను ఆ పాకకు వేలాడదీస్తారు. ఇంటిపైనా నక్షత్రాలను వేలాడదీస్తారు. ఇళ్లలో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకుంటారు. నక్షత్రాలు, చిన్ని గంటలు, చిన్న చిన్నగోళాలతో అందంగా రెడీ చేస్తారు.   

ఒక్కో దేశంలో ఒక్కోలా క్రిస్మస్ వేడుకలు

ఇక క్రిస్మస్ రోజున క్రిస్టియన్లు హ్యాపీగా, జాలీగా గడుపుతారు. స్పెషల్ గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు. బంధుమిత్రులతో కలిసి పార్టీలు జరుపుకుంటారు. రుచికరమైన ఆహార పదార్థాలతో విందును ఎంజాయ్ చేస్తారు. పండుగ రోజున ఆయా సంప్రదాయాల ప్రకారం వేడుకలు జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోదేశంలో ఒక్కో మాదిరిగా క్రిస్మస్ సంబురాలు జరుపుకుంటారు. సంప్రదాయాలు, సంస్కృతులకు అనుగుణంగా నిర్వహించుకుంటారు. ఏ దేశంలో క్రిస్మస్ వేడుకలను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మెక్సికో: మెక్సికోలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. క్రీస్తు జననానికి ముందు రోజు అంటే డిసెంబర్ 24 రాత్రి నుంచే  జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా అర్ధరాత్రి వేళ చక్కటి సంగీతం, నృత్యాలతో ఆహ్లాదంగా గడుపుతారు. ఫెస్టివల్ స్పెషల్ ఫుడ్ ను ఆస్వాదిస్తారు.   

జపాన్: జపాన్‌లో క్రిస్మస్ సందర్భంగా సెలవు దినం ఉండదు. కానీ, ప్రజలు ఈ వేడుకలను మాత్రం ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ నాడు చాలా మంది డిన్నర్ డేట్ కు వెళ్తారు. ఇంట్లో వంట చేయడానికి బదులుగా చాలా మంది బయటే ఫుడ్ తినేందుకు ఇష్టపడుతారు. క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ మంది చికెన్ ఫుడ్ ఆర్డర్ చేస్తారు. చక్కటి విందు, వినోదాలతో జపాన్ ప్రజలు క్రిస్మస్ జరుపుకుంటారు.

ఫ్రాన్స్: ఫ్రాన్స్‌ లో క్రిస్మస్ వేడుకలు సాధారణంగా డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతాయి. కానీ, క్రిస్మస్ ఈవ్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున ప్రజలు పెద్ద విందును జరుపుకుంటారు. అర్ధరాత్రి సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ విందును ఆరగిస్తారు.   

చైనా: చైనాలో క్రిస్మస్ జరుపుకునే క్రైస్తవుల జనాభా తక్కువ. క్రిస్మస్ సందర్భంగా  క్రిస్టియన్లు వారి పిల్లలకు ప్రత్యేక బహుమతులు అందిస్తారు.  ముఖ్యంగా ఆపిల్స్ ను ఇస్తారు. క్రిస్టియన్ కుటుంబాలు ‘ట్రీ ఆఫ్ లైట్’ అని పిలిచే ప్లాస్టిక్ క్రిస్మస్ చెట్టును కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. దానిని చక్కటి లాంతర్లు, కాగితపు పువ్వులతో అలంకరిస్తారు.

స్వీడన్: స్వీడన్, ఫిన్లాండ్, నార్వేలో క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ ప్రారంభంలో సెయింట్ లూసియా డేతో ప్రారంభిస్తారు. ఈ రోజును ఆయా దేశాల్లో సెలవుదినంగా అమలు చేస్తున్నారు.  సెయింట్ లూసియా  తొలి క్రైస్తవ అమరవీరులలో ఒకరిగా భావిస్తారు. ఆమె క్రైస్తవ విశ్వాసాలను కాపాడుకోవడానికి మరణించిన వారిని గుర్తుచేసుకుంటారు. ఈ సందర్భంగా బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలు తెలుపు దుస్తులు ధరించి సాంప్రదాయబద్దమైన పాటలు పాడతారు. ప్రతి కుటుబంలోని పెద్ద కుమార్తె కాఫీ, కుంకుమ పువ్వుతో తయారు చేసిన రొట్టె, అల్లం బిస్కెట్లు లాంటి కాల్చిన వస్తువులను కుటుంబ సభ్యులకు అందించడం సంప్రదాయంగా వస్తోంది.

భారత్: మనం భారతదేశంలో క్రిస్మస్‌ వేడుకలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతాయి. గోవా, కేరళ, ముంబై, ఈశాన్య ప్రాంతాలలో పాశ్చాత్య, స్థానిక సంప్రదాయాల ప్రకారం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.  గోవాలో ప్రజలు మిడ్‌నైట్ మాస్ కి హాజరయ్యే ముందు సంప్రదాయ విందు నిర్వహించుకుంటారు. ఈ విందు తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. పూర్వపు పోర్చుగీస్ కాలనీ అయిన గోవాలో అనేక పురాతన చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు.  

ఆస్ట్రేలియా: క్రిస్మస్ పండుగ ఇక్కడ వేసవిలో జరుగుతుంది. చాలా మంది ఇంట్లో, పార్కులో, బీచ్‌లో బార్బెక్యూ పార్టీలు నిర్వహించుకుంటారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యే సమయం కావడంతో ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.    

స్పెయిన్: ఈ దేశంలో క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 24న ప్రారంభం అవుతాయి. జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా తమ పిల్లలకు ప్రత్యేక బహుమతులు అందిస్తారు తల్లింద్రుడులు. స్పెయిన్‌లో క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడుపుతారు. ప్రజలు తమకు ఇష్టమైన వారితో టైమ్ స్పెండ్ చేయాలని భావిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget