Weight Loss Tips : జిమ్‌కి వెళ్లనవసరం లేకుండా ఇంట్లోనే చేయగలిగే సింపుల్ వ్యాయామాలు.. ఈజీగా బరువు తగ్గుతారు
Weight Loss Home Workouts : జిమ్‌కి వెళ్లకుండానే వేగంగా కొవ్వును తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే జీవక్రియను పెంచుకోవడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, బరువు తగ్గేందుకు ఈ 5 వ్యాయామాలు ట్రై చేయండి.

Home Workouts for Weight Loss : బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా.. కానీ జిమ్‌కి వెళ్లేందుకు డబ్బు, టైమ్ రెండూ లేవా? అయితే మీరు వర్రీకాకండి. ఇంట్లో ఉంటూనే ఫిట్‌గా ఉండేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉంటూనే.. అతి తక్కువ సమయంలో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ మీరు ఈజీగా బరువు తగ్గుతూ ఫిట్‌గా మారవచ్చు. ఇంట్లో ఉంటూ ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలిగే వ్యాయామాలు ఏంటో? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. కేవలం కొన్ని నిమిషాలు ఈ వ్యాయామాలు చేయడం వల్ల మీ మెటబాలీజం పెరగడంతో పాటు.. శరీరం బరువు తగ్గుతూ ఫిట్‌గా మారతారు.
సులభంగా ఇంట్లో చేసుకోగలిగే వ్యాయామాలే మంచి ఎఫెక్టివ్‌గా ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేలా చేస్తాయి. అలాగే శరీరంలోని ఫ్యాట్‌ని బర్న్ చేయడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా కూడా చేస్తాయి. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటంటే..
జంపింగ్ జాక్స్
జంపింగ్ జాక్స్ పూర్తి-శరీరానికి కదలికను అందించడంతో పాటు.. కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, కోర్‌ను అన్నింటినీ నిమగ్నం చేస్తుంది. వీటిని చేయడానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. కాబట్టి మీ రూమ్‌లో చేసుకోవచ్చు. చేయడం సులభం కూడా. కొత్తగా ప్రారంభించేవారు 30 సెకన్ల విరామంతో 50 జంపింగ్ జాక్‌లు 3 రౌండ్లు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. స్టామినా పెంచి ఫ్యాట్ బర్న్ చేస్తుంది.
హై నీస్
హై నీస్ కూడా కొవ్వును సులభంగా బర్న్ చేస్తాయి. ఈ వ్యాయామం చేసేప్పుడు మోకాళ్లు ఛాతీ వైపు ఎత్తడం ద్వారా మీ కోర్, కాళ్లు మరింత స్ట్రాంగ్ అవుతాయి. హై నీస్ క్రమం తప్పకుండా చేయడం వల్ల హిప్ ఫ్లెక్సర్‌లు, గ్లూట్‌లు, పొత్తికడుపు కండరాలు బలపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. కేవలం 30 సెకన్ల వేగవంతమైన హై నీస్ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కేలరీలు బర్న్ చేసేలా చేస్తుంది. కొవ్వును ప్రభావవంతంగా తగ్గించుకోవడానికి 30 సెకన్ల విరామంతో 30 సెకన్ల పాటు 4 రౌండ్లు చేయాలి.
స్క్వాట్ జంప్
(Image Source: Pinterest/selfmagazine)
మీరు కొవ్వును తగ్గించుకోవడంతో పాటు కాళ్లను టోన్ చేయాలని చూస్తున్నట్లయితే స్క్వాట్ జంప్‌లు తప్పనిసరిగా చేయాలి. ఇది స్ట్రెంత్, కార్డియోను మిళితం చేస్తుంది. క్వాడ్స్, హామ్ స్ట్రింగ్‌లు స్ట్రాంగ్ చేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. కొవ్వును బర్న్ చేస్తుంది. బిగినర్స్ ప్రాథమికంగా స్క్వాట్‌తో ప్రారంభించవచ్చు. అనంతరం మీకు వీలైనంత ఎత్తుకు ఎగరవచ్చు. ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు స్మూత్ ల్యాండింగ్ చేయాలి. 30-60 సెకన్ల విశ్రాంతితో 12-15 రెప్స్ 3 సెట్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మీకు మోకాళ్ల సమస్యలు ఉంటే.. సాధారణ స్క్వాట్‌లతో ప్రారంభించి.. క్రమంగా జంప్‌కు వెళ్లొచ్చు.
మౌంటెన్ క్లైంబర్స్
(Image Source: Pinterest/selfmagazine)
మౌంటెన్ క్లైంబర్స్ ఒకే డైనమిక్ కదలికలో చేసే పూర్తి శరీర వ్యాయామం. మీరు ఈ వ్యాయామంలో అధిక ప్లాంక్ స్థానంలో ఉండాలి. ఆపై మీ మోకాళ్లను రన్నింగ్ మోషన్‌లో ఛాతీ వైపునకు తీసుకెళ్లాలి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, మొత్తం శరీరాన్ని.. ముఖ్యంగా కోర్, భుజాలు, కాళ్లను స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మౌంటెన్ క్లైంబర్‌లను వేగంగా చేస్తారు కాబట్టి.. ఇది కార్డియో, స్ట్రెంత్‌కి కూడా మంచిది. మీరు 40 సెకన్ల పాటు 4 రౌండ్లు ప్రయత్నించవచ్చు. 20 సెకన్ల విశ్రాంతి తీసుకోవచ్చు.
బర్పీస్
(Image Source: Pinterest/vitonica)
కొవ్వును కాల్చే సామర్థ్యం విషయానికి వస్తే బర్పీస్ బెస్ట్. ఇవి చేయడం వల్ల బలంగా మారడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ కదలిక ఛాతీ, చేతులు, కాళ్లు, వీపుతో సహా దాదాపు ప్రతి కండరాల సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఒకే బర్పీలో స్క్వాట్, జంప్, ప్లాంక్, పుష్-అప్ ఉంటాయి. ఇది పూర్తి వ్యాయామంగా మారుస్తుంది. 5–8 రెప్స్ 3 సెట్‌లతో ప్రారంభించాలి. మీరు స్టామినా పెంచుకున్నప్పుడు 10–15 రెప్స్ వరకు చేయవచ్చు.
వీటితో పాటు హెల్తీ డైట్ తీసుకోవడం.. వర్క్ మధ్యలో వాకింగ్ చేయడం, మెరుగైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునేందుకు సింపుల్ యోగాసనాలు వంటివి చేయడం వల్ల బరువు తగ్గడంలో, ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడంలో మంచి ఫలితాలు చూస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















