News
News
వీడియోలు ఆటలు
X

Low BP: బీపీ తగ్గినా ప్రమాదమే, తగ్గకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

బీపీ తీవ్రంగా పడిపోతే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.

FOLLOW US: 
Share:

మన శరీరంలో రక్తం ఒక నిర్ధిష్ట వేగంతో, పీడనంతో నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ వేగాన్ని, పీడనాన్ని బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ అంటుంటారు.  రక్త ప్రసరణ వేగం అంటే బీపీ పెరిగినా, తగ్గినా కూడా ప్రమాదకరమే. రక్తవేగం పెరిగితే పీడనం కూడా పెరిగి రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది శరీరం లోపలి ముఖ్యమైన అవయవాలలో సమస్యలు వస్తాయి. అదే వేగం తగ్గితే పీడనం కూడా తగ్గిపోతుంది. అందువల్ల రక్త సరఫరా సరిపడినంత లేక పోవడం వల్ల గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలన్నీంటికి ఆక్సిజన్ సరిపడినంత అందదు. బీపి ఎక్కువుంటే దానిని హైపర్ టెన్షన్ అని, బీపీ తక్కువగా ఉంటే దాన్ని హైపోటెన్షన్ అని అంటారు.

బీపి మానిటరింగ్ లో 90mm Hg/ 60mm Hg వరకు నమోదైతే దానిని లోబీపి గా చెప్పవచ్చు. బీపి పడిపోతే శరీర అవయవాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఇలా జరిగితే మొదట కన్ఫ్యూజన్ వస్తుంది, తర్వాత నెమ్మదిగా కళ్లుతిరగడం, అలసటగా అనిపించడం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ బాగా పడిపోయినపుడు చూపు మందగించడం, తలనొప్పి, మెడనొప్పి, వికారంగా అనిపించడం, గుండె దడ, చల్లగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు

బీపీ తగ్గినపుడు ఇలా చేయండి

  • తరచుగా బీపీ పడిపోయే వారు రాత్రి పూట నానబెట్టిన ఎండుద్రాక్షను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 5 ఎండు ద్రాక్షలు అంటే కిస్మిస్ లు రాత్రి కడిగి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినాలి. ఇది శరీరంలో ఐరన్ లెవెల్స్ ను కూడా పెరిగేందుకు దోహదం చేస్తుంది.
  • డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. తరచుగా నీళ్లు తాగడం, నోరు తడారిపోకుండా చూసుకోవాలి.
  • పోషకాహారం తప్పనిసరి. తగినంత మినరల్స్ కలిగిన ఆహారం తీసుకోవాలి.
  • లోబీపీ తో బాధపడేవారు క్యారెట్, పాలకూర జ్యూస్ లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • ఉసిరి బీపి ని చాలా బాగా మెనేజ్ చేస్తుంది. రోజుకు ఒక ఉసిరి తింటే చాలు శరీరంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా మీరు తీసుకునే ఇతర ఆహారాల నుంచి కూడా పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది.
  • తులసి ఆకులు కూడా బీపి మేనేజ్ చెయ్యడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. రోజుకు 5-6 తులసి ఆకులను నమలడం వల్ల రక్తప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది.

లోబీపి సమస్య నిజానికి హై బీపితో పోలిస్తే పెద్ద ప్రమాదకరం కాదు. కానీ రోజువారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. తరచుగా బీపీ పడిపోతున్నా లేక లో బీపి వల్ల స్పృహ కోల్పోయే పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించడం అవసరం. ఎందుకంటే ఇది మరేదైన తీవ్రమైన అనారోగ్యం వల్ల కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ ను కలిసి కారణాలు తెలుసుకోవడం అవసరం.

Also read: మండే ఎండల్లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 06 May 2023 10:41 AM (IST) Tags: Blood pressure Low BP hypo tension

సంబంధిత కథనాలు

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్