News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Baby Care: వర్షాకాలంలో దోమల నుంచి ఇలా మీ చిన్నారులని రక్షించుకోండి

వర్షాకాలం గురించి ఒక రకంగా చెప్పాలంటే దోమల రాజ్యమనే చెప్పాలి.

FOLLOW US: 

వర్షాకాలం గురించి ఒక రకంగా చెప్పాలంటే దోమల రాజ్యమనే చెప్పాలి. వర్షాలు పడటం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోవడంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో పిల్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దోమల వల్ల అనేక రోగాలు వ్యాప్తి చెందటం వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తీవ్ర ఇబ్బందులు పడతారు. పసిపిల్లల విషయంలో పెద్దలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి జ్వరాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దోమల నివారణకు ఇళ్ళల్లో జెట్ కాయిల్స్, ఆలౌట్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల చిన్నారులు చాలా ఇబ్బంది పడతారు. వాటి నుంచి వచ్చే వాసన పసిపిల్లలు పీల్చడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు ఎంచుకోవాలి. చిన్నారులకి  దోమలు కుట్టకుండా ఉండేందుకు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు.. 

దుస్తులు సరిగా వెయ్యాలి 

శరీరమంతా కప్పి ఉంచే విధంగా పసిపిల్లలకి దుస్తులు వెయ్యాలి. చేతులు, కాళ్ళు కప్పి ఉంచే విధంగా వదులుగా ఉండే కాటన్ దుస్తులని ఎంచుకోవడం ఉత్తమం. ఇవి వెయ్యడం వల్ల శిశువులకి హాయిగా ఉంటుంది. 

రసాయనాలు గాఢత తక్కువగా ఉన్న వాటిని వాడాలి 

దోమలను అరికట్టేందుకు మార్కెట్లో ఎన్నో రకాల మందులు దొరుకుతున్నాయి. హానికమైన రాశయనలతో తయారు చేసిన వాటిని ఇంట్లో ఉపయోగించడం వల్ల పిల్లలు ఆ వాసన పీల్చి ఇబ్బంది పడతారు. అందుకే సహజ సిద్ధమైన వాటితో తయారు చేసిన మందులని ఉపయోగించడం ఉత్తమం. DEET (N, N-diethyl-meta-toluamide) అనేది కీటకాలను అరికట్టడంలో చాలా ప్రభావవంతమైన రసాయన ఏజెంట్. ఇది ఎక్కువగా పీచడం వల్ల పొక్కులు, మూర్ఛ, జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు శ్వాస ఆడకపోవడం వంటి ప్రతికూల దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందుకే పసిపిల్లల సంరక్షణ కోసం DEET ఫ్రీ ఉన్నలెమన్‌గ్రాస్, సిట్రోనెల్లా, యూకలిప్టస్ మరియు లావెండర్ వంటి పదార్థాలతో తయారు చేయబడిన ఔషధాలు ఉపయోగించడం మంచిది. దోమలు నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషించి మీ శిశువును దోమకాటు నుంచి రక్షిస్తుంది. 

మురుగునీరు ఉండకూడదు 

మన ఇంటి చుట్టూ పక్కల వాతావరణం శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. మురుగు నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాలు దోమల వ్యాప్తిని ఎక్కువ చేస్తాయి. అందుకే పరిసర ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 

దోమ తెరలు వాడాలి 

పసి పిల్లలు పడుకునే బెడ్ లేదా ఉయ్యాల చుట్టూ దోమతెర వెయ్యాలి. శిశువుకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గాలి తగిలే విధంగా దోమ తెరలు ఏర్పాటయి చెయ్యాలి. ఇవి మీ చిన్నారిని దోమకాటు నుంచి కాపాడేందుకు రక్షణగా నిలుస్తాయి. ఇంటి కిటికీలు, గుమ్మాలకి కూడా దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలి. దోమలు కుట్టకుండా ఉండేందుకు పసిపిల్లలకు మార్కెట్లో కొన్ని క్రిములు కూడా దొరుకుతున్నాయి. వవాటిని మీ చిన్నారుల చేతులు, కాళ్ళకి రాయడం మంచిది. 

జ్వరం వస్తుందేమో చూసుకోవాలి 

పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. జ్వరం, వికారం మరియు వాంతులు, తలనొప్పి, నోరు పొడిబారడం, మూత్రవిసర్జన తగ్గడం, దద్దుర్లు మరియు గ్రంథులు వాపు వంటివి కొన్ని లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Also Read: ఒత్తిడిని అధిగమించలేకపోతున్నారా? ఇదిగో మ్యూజిక్ పరిష్కారం

Also Read: స్విమ్మింగ్ చేస్తే ఇన్ని లాభాలా? ఇంకెందుకు ఆలస్యం మీరు ఈత కొట్టేయండి మరి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 27 Jul 2022 02:19 PM (IST) Tags: Mosquitoes Baby Care Tips Monsoon Baby Care Tips Protect Your Baby Health

సంబంధిత కథనాలు

Ghee Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండాల్సిందే

Ghee Side Effects: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యికి దూరంగా ఉండాల్సిందే

విచిత్రం - హైవేపై స్పృహ తప్పిన డ్రైవర్, అదుపు తప్పకుండా 25 కిమీలు ప్రయాణించిన కారు

విచిత్రం - హైవేపై స్పృహ తప్పిన డ్రైవర్, అదుపు తప్పకుండా 25 కిమీలు ప్రయాణించిన కారు

Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్

Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్

Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

టాప్ స్టోరీస్

AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు -  ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్

Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్

Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్

Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్

IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!

IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!