అన్వేషించండి

Weight Loss: బరువు తగ్గాలా? జంక్‌ ఫుడ్‌కు బదులు వీటిని ట్రైచేయండి - రుచిగా ఉంటాయ్, ఆరోగ్యకరం కూడా!

అధిక బరువు ఇప్పుడు అందరి సమస్య. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు వచ్చిన తర్వాత తినడం గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చెయ్యడం. దీని వల్ల అధిక బరువు వచ్చేస్తున్నారు. పొట్ట పెరిగిపోతుంది.

అధిక బరువు ఇప్పుడు అందరి సమస్య. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు వచ్చిన తర్వాత తినడం.. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చెయ్యడం అలవాటైపోయింది. దీని వల్ల బరువు, పొట్ట పెరిగిపోతున్నాయ్. వర్క్ చేస్తున్నపుడు కొంతమంది నోరు ఎందుకు ఖాళీగా ఉంచుకోవడం అని ప్యాక్డ్ ఫుడ్, బంగాళాదుంప చిప్స్ వంటివి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని.. నోటికి పని చెప్తూ ఉంటారు. పని చేస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు. దాని వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. బరువు రావడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవలంటే మాత్రం నానా తంటాలు పడాలి. వర్క్ అవుట్స్ అంటూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ.. ఇష్టమైన ఆహార పదార్థాలు తినకుండా దూరం పెడుతూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అయితే మీరు తినే ఆహార పదార్థాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే బరువు పెరగరు అలాగే మీ కడుపు నిండుతుంది.

సోడాకి బదులుగా నిమ్మకాయ నీళ్ళు

బయటకి వెళ్ళినప్పుడు చాలా మంది దాహంగా అనిపిస్తే వెంటనే ఓ కూల్ డ్రింక్ లేదా సోడా కొనుక్కుని తాగేస్తారు. దాని వల్ల దాహం తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ దాని వల్ల ఇతర సమస్యలు రావడమే కానీ ప్రయోజనం ఉండదు. వాటికి బదులుగా నిమ్మకాయ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. డ్రింక్స్ రుచిగా ఉండేందుకు వాటిలో రసాయనాలు కలుపుతారు, చక్కెర అదిక మోతాదులో ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలను ఏమాత్రం అందించలేవు. అందుకే వాటికి బదులుగా నిమ్మకాయ నీళ్ళు తాగడం ఉత్తమం. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

బంగాళాదుంప చిప్స్ బదులుగా పాప్ కార్న్

సినిమా చూసేటప్పుడు లేదా ఖాళీగా ఉండి ఏమి తోచని సమయంలో చాలా మంది బంగాళాదుంప చిప్స్ తింటూ ఉంటారు. వీటికి బదులుగా మొక్క జొన్న పాప్ కార్న్ ఎంచుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. మనకి తిన్నట్టు అనిపిస్తుంది దానితో పాటు శరీరానికి తక్కువ కేలరీలను అందిస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

వెన్న కాకుండా ఆలివ్ ఆయిల్

ఏదైనా పదార్థాన్ని ఫ్రై చేసుకునేందుకు చాలా మంది వెన్న వాడుతూ ఉంటారు. అందులో ఉండే కొవ్వు గుండె సంబంధ రోగులకి అంత మంచిది కాదు. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆయిల్‌ను ఎంచుకోవడం మంచిది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుతో ఉండే పదార్థం కనుక దీన్ని ఎంచుకోవచ్చు.

ప్రూట్ జ్యూస్ కాకుండా పండ్లు

పండ్లలో ఫైబర్, శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అదే వాటిని జ్యూస్‌‌గా చెయ్యడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ కోల్పోతాము. అందువల్ల పండ్ల రసాలను ఎంచుకోకుండా మొత్తం పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.

లస్సీకి బదులుగా పెరుగు

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాలిష్యం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు పెరుగు డైట్ లో భాగం చేసుకుంటే మనకే మంచిది. కానీ, దాన్ని లస్సీ రూపంలో తీసుకోవద్దు. లస్సీలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: బొజ్జ తగ్గాలా? పరగడుపున ఇది తాగితే బెల్లి ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది, ఇలా తయారు చేయండి

Also Read: చూయింగ్ గమ్‌ నమిలితే బరువు తగ్గుతారా? అపోహలు - వాస్తవాలు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Winter Diet for Diabetics : మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
Bottled Water : రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
Constipation in Winter : శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Embed widget