Chai Murukulu Crazy Combination : మురుకులు, చాయ్ కాంబినేషన్ ఇష్టమా? అయితే ఇలా సింపుల్‌గా బోనాలకు చేసేయండి
Bonalu Special Recipe : బోనాల సమయం వచ్చేసింది. ఈ టైమ్‌లో తెలంగాలో పలు రకాల స్పెషల్ వంటలు చేస్తారు. వాటిలో మురుకులు ఒకటి. వీటిని చాయ్‌లో వేసుకుని తింటే దాని రుచే వేరు.
Tasty and Crunchy Murukulu : బోనాల సమయంలో దాదాపు అందరి ఇళ్లల్లో మురుకులు చేసుకుంటారు. ఈ మురుకులను చాయ్‌కి కాంబినేషన్‌గా తీసుకుంటారు. అందుకే తెలంగాణలో చాలామందికి ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది. మీరు కూడా మురుకులు ఇష్టంగా తింటారా? అయితే మురుకులను ఎలా చేయాలి? నూనె ఎక్కువగా పీల్చుకోకుండా.. గుల్లగా వచ్చేందుకు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? వీటిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? తయారీ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 250 గ్రాములు
మినపప్పు- 50 గ్రాములు
నూనె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - రుచికి తగినంత
వామ్ము - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - పిండి కలిపేందుకు సరిపడా
తయారీ విధానం
బియ్యం పిండిని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే మీరు కచ్చితంగా కొలతల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పావు కిలో బియ్యం తీసుకుంటే.. దానికి 50 గ్రాముల మినపప్పు వేసుకోవాలి. కిలోబియ్యం తీసుకుంటే 200 గ్రాముల మినపప్పు తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత. వీటిని మర ఆడించుకోవాలి. లేదా ఇంట్లో మిక్సీ చేయించుకుంటే.. పిండిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని కాసేపు ఎండలో ఉంచాలి. అనంతరం దానిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు బియ్యం పిండి మిశ్రమంలో వామ్ము వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేడి నీరు వేస్తూ.. పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. కాస్త మెత్తగా ఉంటేనే గుల్లగా వస్తాయి. నూనెను తక్కువ పీల్చుకుంటాయి. ఇప్పుడు జంతికల కోసం.. ప్లేట్ రెడీ చేసుకుని.. చక్రాలగిద్దకు నూనె రాసి.. దానిలో పిండి ఉంచాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. కడాయి పెట్టి నూనెను వేయాలి.
నూనె వేడి అయిన తర్వాత.. మంటను తగ్గించి ఉంచి.. మురుకుల పిండిని నేరుగా వేయాలి. లేదంటే ప్లేట్‌కి నూనె రాసి కూడా పిండిని వేయొచ్చు. మురుకులు నూనెలో వేసేప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నూనె వేడిగా ఉండాలి కానీ.. మంట సిమ్‌లో ఉండాలి. అప్పుడే మురుకులు నూనెను పీల్చుకోవు. పైగా లోపలి నుంచి బాగా ఉడుకుతాయి. అలాగే మురుకులు కాస్త ఉడికిన తర్వాత.. మంటను మీడియంలో ఉంచి.. రెండు వైపులా బాగా వేయించుకోవాలి.
Also Read : గారెలను ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. హెల్తీ రెసిపీ ఇదే చాలా సింపుల్
మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే.. వాటిని మరోగొన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో మురుకులు చేసుకోవాలి. వీటిని తెలంగాణలో బోనాల సమయంలో ఎక్కువగా చేసుకుంటారు. నేరుగా తినడమే కాకుండా.. ఛాయ్‌లో వేసుకుని.. మురుకులను ఆస్వాదిస్తూ.. మరో లోకానికి వెళ్తారు. దాదాపు తెలంగాణలో అందరూ ఈ కాంబినేషన్‌ను ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ బోనాల సమయంలో మీరు కూడా ఈ మురుకులు చేసుకుని లాగించేయండి.
Also Read : సండే స్పెషల్ టేస్టీ హల్వా.. కరాచీ స్టైల్లో రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి