By: Haritha | Updated at : 07 Jun 2023 08:35 AM (IST)
(Image credit: Pixabay)
అందంగా కనిపించాలంటే చర్మం మెరవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల చర్మం పొడి బారిపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఉన్న ఆహారాలను తింటే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. బయట భోజనాలు మాని ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే తినడం అలవాటు చేసుకోవాలి. చర్మాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మనం తినే ఆహారంలో చర్మానికి మెరుపును అందించే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. రోజూ వాటిని తినడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
పుదీనా
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోస్మారినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల చర్మం అందంగా ఉంటుంది. రక్తప్రసరణ సక్రమంగా జరగడం వల్ల మెరుపును సంతరించుకుంటుంది. దీనివల్ల అందంగా కనిపిస్తారు.
కాకరకాయ
కాకరకాయను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ అది ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీనిలో కరిగే విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది. కెరటోనాయిడ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. జియాక్సంతిన్ వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా కనిపించడమంటే అందంగా కనిపిస్తున్నట్టే లెక్క.
నేరేడు పండ్లు
బ్లాక్ జామూన్ అని పిలిచే నేరేడు పండ్లలో ఎల్లాజిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం డేమేజ్ కాకుండా కాపాడతాయి. చర్మంపై దురదలు, ఎరుపుదనం, మంట వంటివి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. చర్మంలో తేమను నింపుతాయి. దీనివల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.
ఉసిరికాయలు
ఉసిరికాయలు తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా శరీరానికి అందుతుంది. ఉసిరికాయలు తినడం వల్ల అందులో ఉండే హైలురోనిక్ ఆమ్లం చర్మం అకాల వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడుతుంది. అంటే ముడతలు, గీతలు, మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఇవి బలమైన యాంటీ హైలురోనిడేస్ చర్యను కలిగి ఉంటాయి.
బూడిద గుమ్మడి
బూడిద గుమ్మడికాయను చాలా తక్కువ మందే తింటారు. దీన్ని తినడానికి ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. దీనిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చి అందంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి బూడిద గుమ్మడికాయని ఏదో రకంగా వారానికి రెండు మూడు సార్లయినా ఆహారంలో తీసుకోవాలి.
Also read: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
Also read: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!
Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు
Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!
Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!
Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ
Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
/body>