అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jasmine Bhasin: వామ్మో, కంటి లోపల ఇలాంటి గాయాలు కూడా ఏర్పడతాయా? సీరియల్ నటికి నరకం చూపిన కార్నియల్ డ్యామేజ్ - అసలు ఏంటిది?

Jasmine Bhasin: తాజాగా బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్.. తనకు కార్నియల్ డ్యామేజ్ జరిగిందని ప్రకటించింది. దీంతో అసలు కార్నియల్ డ్యామేజ్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

Jasmine Bhasin: బాలీవుడ్‌లో కొంతమంది బుల్లితెర హీరోయిన్లు.. వెండితెర హీరోయిన్లకు పోటీగా నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి క్రేజ్ ఉన్న నటీమణుల్లో జాస్మిన్ భాసిన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ భామ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి తనకు వచ్చిన వ్యాధే కారణం. తాజాగా జాస్మిన్ భాసిన్ కంటికి గాయమయ్యింది. దానివల్ల భరించలేని నొప్పితో తను డాక్టర్‌ను సంప్రదించింది. అప్పుడే తనకు కార్నియల్ డ్యామేజ్ జరిగిందని బయటపడింది. అసలు కార్నియల్ డ్యామేజ్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నివారించాలి? అని ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

అలా జరిగింది..

ఈరోజుల్లో చాలామంది కళ్లద్దాలు పెట్టుకోవడం కంటే కాంటాక్ట్ లెన్స్ ధరించడమే బెటర్ అని భావిస్తున్నారు. అలాగే ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్‌కు కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల తనకు కార్నియల్ డ్యామేజ్ జరిగిందని జాస్మిన్ భాసిన్ బయటపెట్టింది. ‘‘నా కాంటాక్ట్ లెన్స్‌కు ఏం సమస్య ఉందో తెలియదు కానీ అవి పెట్టుకున్న తర్వాత నా కళ్ల మండడం మొదలయ్యింది. మెల్లగా ఆ మంట చాలా పెరిగిపోయింది. ముందు నేను డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి అనుకున్నాను కానీ వర్క్ కమిట్మెంట్ ఉండడం వల్ల ఈవెంట్ అయ్యాక వెళ్దామని ఆగాను. నేను ఈవెంట్‌లో మొత్తం గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాను. కాసేపటి తర్వాత నాకేం కనిపించలేదు’’ అని చెప్పుకొచ్చింది జాస్మిన్ భాసిన్.

కారణాలు, లక్షణాలు..

కళ్లల్లో ఉండే కార్నియా‌కు జరిగే గాయాన్ని కార్నియా డ్యామేజ్ అంటారని వైద్యులు చెప్తున్నారు. కార్నియా అనేది కళ్ల ముందు భాగంపై ఉండే టిష్యూ. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కార్నియల్ డ్యామేజ్‌కు ఎన్నో కారణాలు ఉంటాయి. కళ్లను ఎక్కువగా నలపడం, కెమికల్స్, కాంటాక్ట్ లెన్స్, అల్ట్రావైలెట్ రేస్ ద్వారా ఈ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ. కళ్లు మసకగా కనిపించడం కార్నియల్ డ్యామేజ్‌లో మొదటి లక్షణం. కళ్లల్లో ఏదో ఉన్నట్టుగా మంట రావడం, వెలుగును చూడలేకపోవడం, కళ్లల్లో నుంచి నీళ్లు రావడం దీనికి సంబంధించిన ఇతర లక్షణాలు.

చికిత్స, నివారణ..

ఒకవేళ కళ్లలో ఏదైనా పడినట్టుగా అనిపిస్తే డాక్టర్ సహాయం లేకుండా దానిని తీసే ప్రయత్నం చేయకూడదు. పొరపాటున కళ్లల్లో కెమికల్స్ ఏమైనా పడితే వెంటనే వాటిని కడిగేయాలి. డాక్టర్ ఇచ్చిన ఐ డ్రాప్స్, ఆయింట్‌మెంట్స్ వంటివి మాత్రమే ఉపయోగించాలి. గాయం తగ్గేవరకు కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించకూడదు. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత కూడా రెండురోజుల పాటు నొప్పి తగ్గకపోతే వెంటనే మరోసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది. కెమికల్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా కళ్లద్దాలు ఉపయోగించాలి. యూవీ నుంచి రక్షించే కళ్లద్దాలు అయితే మరీ మంచిది. చెత్త పడినప్పుడు కళ్లను కవర్ చేసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించినప్పుడు అవి సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి.

Also Read: ‘మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’ ట్రైలర్ - తను ఒక పిచ్చోడు అంటూ రాజమౌళిపై ప్రభాస్, ఎన్‌టీఆర్ వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget