రాత్రి ఈ టైమ్‌కు పడుకుంటే ఆరోగ్యానికి మంచిదట నేటికాలంలో బిజీ లైఫ్ కారణంగా చాలా మంది నిద్రకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి నిద్రరూపంలో అందించాలి. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్నా తగినంత నిద్ర అవసరం. నిద్రించేందుకు ఉత్తమ సమయం.. రాత్రి 10 నుంచి 11 గంటలు. పాఠశాల వయస్సు పిల్లలు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య నిద్రపోవాలి. టీనేజర్లు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రించాలి. నిద్ర ఊబకాయం, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. ధ్యానం, యోగ, శ్వాస వంటి ఆసనాలు చేసి నిద్రిస్తే ప్రశాంతంగా ఉంటుంది.