Intimacy Benefits with Cloves : ఈ ఒక్క మసాలా దినుసుతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో.. లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుందట
Cloves Benefits : లైంగిక, శారీరక ఆరోగ్య సమస్యలను దూరం చేసే మసాలా దినుసు ఒకటుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ ఆ మసాలా దినుసు ఏంటి? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే..
Cloves Health Benefits : వంటింట్లోని ఎన్నో పదార్థాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా మసాలా కోసం ఉపయోగించే దినుసులు.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయని ఔషద నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి మగవారి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందట. ముఖ్యంగా పలు రకాల లైంగిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది మంచిది అంటున్నారు. ఇంతకీ ఆ మసాల దినుసు ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. దీనిని అస్సలు చిన్నచూపు చూడొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఎఫెక్టివ్ మూలిక ఇది. దీనిని వంటల్లోనే కాకుండా నేరుగా కూడా తీసుకోవచ్చు. మగవారికి దీనివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక ఆరోగ్యానికై..
లవంగాలు మగవారిలో టెస్టోస్టిరాన్‌ను ప్రమోట్ చేస్తాయి. ఇది లిబిడో, ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుంది. లిబిడో లైంగిక ఆరోగ్యానికి కీలకమని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. మగవారిలో వివిధ కారణాల వల్ల లిబిడో తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వారు రెగ్యూలర్‌గా తీసుకుంటే టెస్టోస్టిరాన్ ఉత్పత్తితో పాటు.. లిబిడో కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్పెర్మ్ కౌంట్‌ని కూడా పెంచుతుంది.
నపుంసకత్వాన్ని దూరం చేస్తోంది..
లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది ఒత్తిడిని దూరం చేసి లైంగికంగా ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్కలనం, నపుంసకత్వం వంటి లైంగిక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. అంగ స్తంభన సమస్యకూడా దూరమవుతుంది. అంతేకాకుండా వీటిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రోస్టేట్ గ్రంథిలో మంటను తగ్గిస్తాయి. వాపు వంటి లక్షణాలు తగ్గుతాయి.
జీర్ణ సమస్యలకై..
లవంగాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలను మగవారిలో తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేసి మొత్తం ఆరోగ్యానికై హెల్ప్ చేస్తాయి. ఒత్తిడి, యాంగ్జైటీ లక్షణాలను తగ్గిస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
నోటి సంరక్షణకై..
లవంగాలు ఓరల్ హెల్త్‌కి బాగా హెల్ప్ చేస్తాయి. పంటి ఆరోగ్యానికి ఇది చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. లింగబేధం లేకుండా ఇది పంటి సమస్యలను దూరం చేస్తుంది. పంటి నొప్పి, నోటి దుర్వాసన, గమ్ సమస్యలను వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దూరం చేస్తాయి.
రోగనిరోధక శక్తికై..
లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇమ్యూనిటీ సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను వ్యాప్తిని అరికడుతుంది.
ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రోజుకు రెండు తింటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకుని వీటిని సేవిస్తే మంచిది.
Also Read : చికెన్ లివర్ అంటే ఇష్టమా? బాగా తింటారా? అయితే ఇది మీకోసమే.. మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.