Sun Stroke Prevention Tips : ఈ ఎండలను తక్కువ అంచనా వేయకండి.. ఈ పొరపాట్లు చేస్తే చనిపోయే ప్రమాదముంది
Heat Strokes : సమ్మర్ హీట్ వేవ్స్ మొదలైపోయాయి. వాతావరణ శాఖ కూడా ప్రజలను బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు ఇస్తుంది. మీకు తెలుసా? ఈ హీట్ వేవ్స్ మీ ప్రాణాలు కూడా తీస్తాయని?
![Sun Stroke Prevention Tips : ఈ ఎండలను తక్కువ అంచనా వేయకండి.. ఈ పొరపాట్లు చేస్తే చనిపోయే ప్రమాదముంది Heat stroke aka summer stroke will lead to deaths in the summer Here are the prevention tips Sun Stroke Prevention Tips : ఈ ఎండలను తక్కువ అంచనా వేయకండి.. ఈ పొరపాట్లు చేస్తే చనిపోయే ప్రమాదముంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/02/e01b5565055117612a8d608faafedcdb1714650189468874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heat Waves in India Summer 2024 : గతంలో వేసవి కాలం కూడా కాస్త బెటర్‌గానే ఉండేది. కానీ ఇప్పుడు వేసవి మరి వేడెక్కిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఎండలను భరించలేకపోతున్నాయి. 2024 గురించి మాట్లాడుకుంటే.. జనవరి మూడోవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి. ఫిబ్రవరికే ఎండకాలాన్ని తలపించే ఎండలు వచ్చేశాయి. మార్చి, ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే వచ్చే రెండు రోజులు కూడా అవ్వలేదు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేసింది. కొన్నిప్రాంతాల్లో 45 డిగ్రీలు మించిన ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. రానున్న రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తోంది.
వారు మరింత జాగ్రత్తగా ఉండాలి..
భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అలెర్ట్స్ జారీ చేస్తుంది. అయితే ఈ హీట్ వేవ్‌లు, అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసందర్భాల్లో మనిషి చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఎండవల్ల చనిపోయాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందుకే ఈ సమ్మర్లో.. ముఖ్యంగా హీట్ వేవ్‌ల సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.
ఆ సమస్యలున్నవారికి ఇంకా ప్రమాదం
అధిక వేడివల్ల అలసట, హీట్ స్ట్రోక్ వంటి వేడి సంబంధిత ఆరోగ్యసమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటే.. డీహైడ్రేషన్ సమస్య ఎక్కువ అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి అదనపు మరణాలుకు దారితీస్తాయి. పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉంటుంది. ఉదయం ఆరుగంటలకే మధ్యాహ్నమా అనే రేంజ్లో ఎండలు ఉంటున్నాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బందే పడేవారిలో ఈ అధిక ఉష్ణోగ్రతలు మరణానికి ప్రధాన కారణంగా మారుతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
హీట్వేవ్స్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. వీలైతే ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా.. ఉదయాన్నే మీ గమ్యస్థానానికి చేరుకునేలా.. సాయంత్రం ఇంటికి వచ్చేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్‌కు గురైతే.. వెంటనే ప్రాథమిక చికిత్సను అందించాలి. వీలైనంత హైడ్రేటెడ్‌గా ఉండాలి. హెల్తీ ఫుడ్స్, హైడ్రేటెడ్‌గా ఉంచే ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకోవాలి. స్పైసీ ఫుడ్స్, ఫ్రై చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎండలో ప్రయాణిస్తే.. మధ్యలో కాస్త నీడలో ఆగుతూ.. నీటిని తాగుతూ ఉండాలి. లేదంటే ఈ వేసవిలో ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. ఈ చిన్న మిస్టేక్స్ మీరు చేస్తే హీట్వేవ్స్కి బలైపోవాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు.
ఎండలు జనాభాను వివిధ రూపాల్లో తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితులను ప్రేరేపిస్తాయి. పని సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా ఎండలు ఏర్పడడానికి గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణం. వాతావరణంలో కలిగే తీవ్రమార్పులన్నీ గ్లోబల్ వార్మిగ్ వల్లే జరుగుతున్నాయి. ఇలాగే ఇది కంటిన్యూ అయితే భవిష్యత్తులో మరిన్నీ తీవ్రమమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పర్యావరణహిత పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : రోజురోజుకు పెరుగుతున్న గవదబిళ్లల సమస్య.. పిల్లలను సురక్షితంగా ఉంచే మార్గాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)