Healthy Breakfast : కొలెస్ట్రాల్, షుగర్‌ను కంట్రోల్ చేసే గ్లూటెన్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్.. రెసిపీ ఇదే
Gluten Free Breakfast : ఉదయాన్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినాలనుకుంటే ఇక్కడ ఓ మంచి రెసిపీ ఉంది. ఇది కేవలం మంచి రుచిని అందించడమే కాకుండా మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.
Banana Oat Pancakes : ఉదయాన్నే జిమ్‌కి వెళ్లేవారి నుంచి.. మధుమేహంతో ఇబ్బందిపడే పెద్దలవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలిగే ఓ హెల్తీ రెసిపీ ఇక్కడ ఉంది. దీనిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాంటి రెసిపీని తయారు చేయడం కష్టమేమో అనుకుంటున్నారేమో కానీ.. దీనిని తయారు చేయడం చాలా తేలిక. అదే ఓట్స్ బనానా పాన్‌కేక్స్. మీరు గ్లూటెన్ ఫ్రీ అయితే ఈ రెసిపీ మీకు సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ హెల్తీ, సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ పిండి - ఒకటిన్నర కప్పులు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
గుడ్లు - 2
అరటిపండ్లు - 2
పాలు - అర కప్పు
వెనిలా ఎసెన్స్ - 1 టీస్పూన్
బటర్ - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో ఓట్స్ పౌడర్, బేకింగ్ పౌడర్.. తగినంత సాల్ట్ వేసి బాగా కలపండి. అరటిపండ్లను గుజ్జు చేసుకుని.. ఈ పౌడర్ మిశ్రమంలో వేయాలి. అరటిపండ్లు కాస్త పండినవి ఉంటే పాన్ కేక్స్ రుచి బాగుంటుంది. దానిలో గుడ్లు, పాలు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. పిండి ఉండలుగా లేకుండా మిశ్రమాన్ని పేస్ట్‌లాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి చిక్కబడేవరకు సుమారు 10 నిమిషాలు కలపాల్సి ఉంటుంది. లేదంటే మీరు దానిని బ్లెండర్లో వేసి కూడా కలుపుకోవచ్చు.
మిశ్రమం రెడీ అయిపోయిన తర్వాత స్టౌవ్ వెలిగించి దానిలో నాన్‌స్టిక్ పాన్ పెట్టండి. దానికి బటర్ అప్లై చేసి.. తయారు చేసుకున్న పిండిని పాన్‌కేక్‌లా పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల అంచులు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు స్టౌవ్ ఫ్లేమ్ తగ్గించి.. పాన్‌కేక్‌ను 3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు దానిని మరోవైపు తిప్పి ఉడికించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా మిగిలిన పిండితో ఇదేవిధంగా చేయాలి. అంతే వేడి వేడి ఓట్స్ బనానా పాన్ కేక్స్ రెడీ.
ఓట్స్ బనానా పాన్ కేక్స్ ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా మంచి టేస్ట్‌ను మీకు అందిస్తాయి. వీటిని మీరు వాల్‌నట్స్‌తో గార్నిష్ చేసి పిల్లలకు అందించవచ్చు. అరటిపండు ముక్కలతో, చాక్లెట్ సిరప్, తేనెతో గార్నిష్ చేసి.. దాని రుచిని పెంచుకోవచ్చు. మీరు పిల్లలకు మరింత రుచిగా ఈ పాన్‌కేక్స్ అందించాలనుకుంటే పిండిలో చాక్లెట్ చిప్స్, నట్స్ వంటి వాటిని వేసి ఈ పాన్‌కేక్స్ రెడీ చేయవచ్చు.
ఈ రెసిపీ కేవలం రుచికోసమే కాదు. ఇది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మీరు గ్లూటెన్ ఫ్రీ రెసిపీల గురించి చూస్తుంటే ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది. అరపండ్లు మీ గుండెను రక్షించడంలో, రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించి.. మానసిక స్థితిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : సగ్గుబియ్యం కిచిడీ రెసిపీ.. దీనిని నైవేద్యంగా కూడా పెట్టొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.