By: ABP Desam | Updated at : 31 Dec 2021 09:08 PM (IST)
Representational Image/Pixabay
2021లో కరోనా వైరస్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘ఊపిరి’ నిలిపేసి.. ప్రాణాలు తోడేసిన కోవిడ్-19.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టినా.. 2022లో దాడి చేసేందుకు పొంచివుంది. 2021లో మనం తీసుకున్న వ్యాక్సిన్ కూడా బలహీనమవుతోంది. ఈ నేపథ్యంలో మనమంతా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మన అలవాట్లను మార్చుకోవాలి. మంచి అలవాట్లతో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే.. ఎలాంటి వైరస్, వ్యాధులతోనైనా పోరాడవచ్చు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన డాక్టర్ మైఖెల్ గ్రేజర్.. మనిషి ఆయుష్షును పెంచే మూడు ఉత్తమ లక్షణాలు గురించి వివరించారు. ఆరేళ్ల కిందట సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పరిశోధనలతో ఆయుష్షు పెంచే మూడు ముఖ్యాంశాలను పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, రోజుకు కనీసం 21 నిమిషాలు వ్యాయామం చేయడం వీటిలో ముఖ్యమైనవి.
1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం: డాక్టర్ గ్రెగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. గోధుమలు, పాస్తా, బంగాళదుంపలు, బ్రౌన్ రైస్, బీన్స్, టొమాటో సాస్, గింజలు, పండ్లు, కూరగాయలను తరుచుగా తీసుకోవాలి. విటమిన్-సి ఎక్కువగా తీసుకోవడం మంచిది. దురాలవాట్లు ఉన్నవారి ఆయుష్సుతో పోల్చితే.. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు 14 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారట. జంతువుల ఆహారాల కంటే ఆకు కూరల్లో 64 రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి.. మీరు తినే ఆహారంలో తప్పకుండా వివిధ రకాల పండ్లు, కూరగాయలు ఉండాలి. మూలికలు, మసాలా దినుసులు కూడా శరీరాన్ని యాంటీఆక్సిడెంట్లతో నింపడం, స్ట్రోక్, ఇతర వయస్సు సంబంధిత సమస్యలను దూరం చేయడానికి సహాయ పడతాయి. దీర్ఘాయువును అందిస్తాయి.
2. స్మోకింగ్ వద్దు: మంచి అలవాట్లు క్రోమోజోమ్‌లపై ఉండే పొడవైన టెలోమియర్‌కు మేలు చేస్తాయని డాక్టర్ గ్రెగర్ తెలిపారు. UChicagoMedicine సర్వే ప్రకారం.. వయస్సు పెరిగే కొద్ది.. కండరాలు, మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. క్రోమోజోమ్‌లు కూడా తగ్గిపోతాయి. కణాల సంఖ్య జరిగి.. విభజన జరిగేప్పుడు టెలోమియర్స్ అనే క్రోమోజోమ్‌ల అంచులు దెబ్బతింటాయి. ఫలితంగా అవి క్రమేనా కుదించబడతాయి. స్మోకింగ్ ఎక్కువగా చేసేవారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. స్మోకింగ్‌కు దూరంగా ఉంటూ.. పండ్లు, కూరగాయలు, ఇతర యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్లాంట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. దూమపానం ఎక్కువ చేసే పురుషుల్లో టెలోమియర్‌ల సంఖ్య పడిపోయినట్లు తెలిసింది.
Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
రోజుకు కనీసం 21 నిమిషాలు వ్యాయామం: కరోనా వైరస్, లాక్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి మనల్ని మరింత లేజీగా మార్చేశాయి. వ్యాయామానికి దూరం కావడం వల్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. దీనివల్ల 2021లో వచ్చిన డెల్టా వేరియెంట్ కరోనా రక్కసిని ఎదుర్కోలేక చాలామంది ప్రాణాలు విడిచారు. కొత్త ఏడాదిలో అలాంటివి జరగకూడదంటే.. తప్పకుండా మీరు రోజుకు కనీసం 21 నిమిషాలు వ్యాయామం చేయాలి. జాగింగ్ లేదా ఏదైనా ఆటలో పాల్గోవడం, గంటన్నర నడక అలవాటు చేసుకోవాలి. దీని గురించి మీరు గంటలు గంటల సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. రోజువారి పనులు చేస్తూనే వ్యాయమం కూడా చేయొచ్చు. మీరు ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చోవడం అస్సలు మంచిది కాదు. అప్పుడప్పుడు లేచి.. అటూ ఇటూ తిరుగుతుండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. జనవరి 1 నుంచే ఈ అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోండి.
Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది
గమనిక: మీ అవగాహన కోసం.. నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిలో పేర్కొన్న డైట్, వ్యాయమం, టిప్స్ వంటివి ఏదైనా పాటించే ముందు తప్పకుండా మీరు వైద్యుడి సలహా తీసుకోవాలి. ఈ కథనంతో ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదని గమనించగలరు.
Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?
Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే - బీ కేర్‌ఫుల్!
Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి
World Aids Day: HIV కి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>