Tulsi Seeds: సబ్జా గింజలు శరీరానికి చల్లదనం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఇస్తాయ్
శరీరాన్ని చల్లబరిచేందుకు మాత్రమే సబ్జా గింజలు ఉత్తమమైన ఎంపికని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తులసి గింజలు అంటే త్వరగా గుర్తుకు రావు కానీ సబ్జా అంటే మాత్రం వాటిని ఇట్టే గుర్తు పట్టేస్తారు. వేసవి కాలంలో సబ్జాకి మంచి డిమాండ్ ఉంటుంది. ఫిట్ నెస్ ఔత్సాహికులు ఎప్పుడు వీటిని తీసుకునేందుకు ఇష్టపడతారు. ఈ విత్తనాలు స్మూతీస్, సలాడ్, డిటాక్స్ డ్రింక్స్ లో చేర్చుకుని తీసుకోవచ్చు. అయితే ఇవి తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇవి ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయో మాత్రం తెలియదు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గుండె ఆరోగ్యం
తులసి గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ ఉంటుంది. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లం. ఇవి మంటని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
బరువు తగ్గిస్తాయి
తులసి గింజల్లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టని నిండుగా ఉంచి ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అతిగా తినదాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. సబ్జా నానబెట్టినప్పుడు దాని మీద జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచేందుకు దోహదపడతాయి.
హైడ్రేషన్
నీటిలో నానబెట్టినప్పుడు ఈ విత్తనాలు కాస్త ఉబబుతాయి. దీని మీద ఏర్పడే జెల్ లాంటి పదార్థం నీటిని పీల్చుకుని ఆకారాన్ని మారుస్తుంది. ఇది శరీరంలో హైడ్రేషన్ స్థాయిలని నిర్వహించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణానికి ఇవి అనుకూలమైన ఫలితాలు అందిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు
తులసి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫేనాల్స్ సహా వివిధ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలని రక్షించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగు
సబ్జా గింజల్లోని శ్లేష్మ స్వభావం నీటిని గ్రహించి జెల్ లాంటి పదార్థాన్ని వాటి మీద ఏర్పరుస్తుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయాంతర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ అందిస్తుంది.
పోషకాలు మెండు
తులసి గింజల్లో డైటరీ ఫైబర్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని అందిస్తాయి.
శరీరాన్ని చల్లబరుస్తుంది
ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యం ప్రకారం తులసి గింజలకు శీతలీకరణ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. శరీర వేడిని తగ్గించేందుకు సహకరిస్తాయి. అందుకే వేసవిలో సబ్జా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వేడి చేయకుండా కూలింగ్ ఇచ్చే వాటిలో ముందుంటుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది
తులసి గింజల్లో అడాప్టోజెనిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనని అధిగమించేందుకు సహాయపడుతుంది. నరాలు శాంతపరుస్తుంది. మానసిక శ్రేయస్సుని మెరుగుపరుస్తుంది.
జుట్టుకి మేలు
సబ్జా గింజల్లో ఉండే పోషకాలు చర్మం, జుట్టుకి మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య సంకేతాలని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇందులో ఐరన్, ప్రోటీన్ వల్ల జుట్టుని సహజమైన మెరుపుని అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఇలా చేశారంటే మీ ఒత్తిడి క్షణాల్లో హుష్ కాకి!