COVID-19 Safety Tips : కొవిడ్, సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Monsoon Health Tips : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలంటున్నారు.

Disease Protection During Rainy Season : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. కొవిడ్ కేసులు రాకుండా, పెరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వర్షాలు ఎక్కువగా వచ్చే సమయంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి కాబట్టి వాటిపై కూడా అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ల, వ్యాధుల వ్యాప్తిని కంట్రోల్ చేయవచ్చో చూసేద్దాం.
శుభ్రత..
కొవిడ్, ఇతర వైరస్, వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలంటే ముందుగా శుభ్రతను ఫాలో అవ్వాలి. చేతులను తరచూ సబ్బుతో లేదా నీటితో కడుగుతూ ఉండాలి. సబ్బు, నీరు అందుబాటులో లేని సమయంలో శానిటైజర్ ఉపయోగించాలి. బయటకు వెళ్లేప్పుడు శానిటైజర్ కచ్చితంగా తీసుకెళ్లాలి.
మాస్క్..
జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో లేదా ఆఫీస్‌ల్లో, మాల్స్‌లో తిరగాల్సి వస్తే కచ్చితంగా మాస్క్ వేసుకుని వెళ్లాలి. ఇది కొవిడ్ వంటి వైరస్ వ్యాప్తులను అరికట్టడంలో హెల్ప్ చేస్తుంది.
నిల్వ నీరు
సీజనల్ వ్యాధులకు దోమలు ప్రధాన కారణం. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు పేరుకుపోయి దానిలో దోమలు అభివృద్ధి చెందుతాయి. ఇవి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి ఇంటి చుట్టూ పక్కలా నిల్వ నీరు లేకుండా చూసుకుంటే మంచిది.
హెల్తీ ఫుడ్
బయట వండే ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఫ్రెష్‌గా, శుభ్రంగా చేసుకునే ఫుడ్ తీసుకోవడం బెస్ట్. ముఖ్యంగా వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండండి. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
వర్షంలో తడిస్తే..
మీరు వర్షంలో తడవాల్సి వస్తే వెంటనే మీ దుస్తులు మార్చేసుకుంటే మంచిది. లేదంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీలైనంత వరకు వర్షంలో తడవకపోవడమే మంచిది.
రోగనిరోధక శక్తి..
సీజనల్ వ్యాధులు, వైరస్లు సోకకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్‌ని తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
క్లోజ్ కాంటాక్ట్ వద్దు..
వ్యక్తులకు దగ్గరగా కాంటాక్ట్‌లో ఉండకండి. ముఖ్యంగా ఇప్పటికే ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి కాస్త దూరంగా ఉంటే మంచిది. వైరల్ ఇన్ఫెక్షన్లు, కొవిడ్ 19 సమస్యలతో ఇబ్బంది పడేవారితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. దీనివల్ల వైరల్ వ్యాప్తి తగ్గుతుంది.
తాగే నీరు..
నీటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు శుభ్రమైన నీటిని తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నీటిని మరిగించి.. వడకట్టి తాగితే మరీ మంచిది. కొన్ని వ్యాధులను దూరం చేసుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుంది.
చికిత్స
మీరు ఎలాంటి వ్యాధులతోనైనా ఇబ్బంది పడుతుంటే లేదా ఆ లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకండి. వైద్యుల సహాయం వీలైనంత త్వరగా తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా త్వరగా రికవరీ అవ్వొచ్చు.
వీలైనంత వరకు బయటకి వెళ్లకపోవడమే మంచిది. వ్యాక్సినేషన్స్ తీసుకుంటూ ఉండాలి. వైద్యులు సూచించే మందులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మీరు సీజనల్ వ్యాధుల, వైరస్ల బారిన పడకుండా ఉండగలుగుతారు.






















