By: ABP Desam | Updated at : 04 Feb 2022 07:57 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పూర్వం కోడి చర్మం ఒలిచి తినే పద్ధతి లేదు. స్కిన్‌తో పాటే కూరవండుకునే వారు. ఆధునిక కాలంలో వచ్చిన పద్ధతి స్కిన్‌లెస్. కోడిపైన చర్మం మొత్తం తీసి పడేసి లోపలి మాంసాన్ని మాత్రమే తింటారు. చర్మం తినే విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అది తినకూడదనే భావన చాలా మందిలో ఉంది. కోడి చర్మం తినడం వల్ల అధికంగా శరీరంలో కొవ్వు చేరుతుందని కూడా చెబుతారు. నిజానికి అది అబద్ధం. చికెన్ స్కిన్ హానికరం కాదు. హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం చికెన్‌ను స్కిన్ తో పాటూ తింటే ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి. కోడి చర్మంలో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. అంటే కోడి చర్మంలో ఉండే కొవ్వు మంచిదన్న మాట. ఈ కొవ్వులు రక్తపోటు నియంత్రిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా చూస్తుంది. కాబట్టి చికెన్ స్కిన్ తినకూడదన్న నియమమేమీ లేదు. తింటే ఎంతో మంచిది కూడా.
ఇలానే తినాలి
చికెన్ స్కిన్ తినాలనుకునేవారు కోడిని ముందు బాగా కాల్చాలి. పల్లెటూళ్లలో కాల్చేపద్ధతి ఇంకా ఉంది. పట్టణాల్లో మాత్రం వేడి నీటిలో ముంచుతారు. అలా వేడి వేడి నీటిలో ముంచినా మంచిదే. ఇలా కాల్చడం, సలసలకాగే వేడినీళ్లలో ముంచడం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఒకవేళ మీకు చికెన్ షాపు వాడిమీద నమ్మకం లేకపోతే మీరు కూడా వేడి నీళ్లలో చికెన్ ముక్కలు వేసి కాసేపటి తరువాత వండుకోవచ్చు. అయితే చికెన్ స్కిన్ తో పాటూ తినేవారు మితంగా తినాలి. లేకుంటే అధిక స్థాయిలో ఫ్యాట్స్ ఒంట్లో చేరుతాయి. ఈ చర్మంలో ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరమైనవి, అయితే అది తక్కువ మొత్తంలోనే. అధిక మొత్తంలో శరీరంలో చేరితే ఇన్ ఫ్లమ్మేషన్ రావచ్చు. కాబట్టి మితంగా స్కిన్ తో వండి చికెన్ కూర తినవచ్చు.
చికెన్ తినడం వల్ల లాభాలు
ఏ ఆహారాన్ని అధికంగా తిన్నా అనారోగ్యాలు, సమస్యలు తప్పవు. అదే విధంగా చికెన్ కూడా మోతాదుకు మించకుండా తింటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.
1. చికెన్ తినడం వల్ల రక్త హీనత సమస్య దరిచేరదు. దీనిలో విటమిన్ బి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
2. జలుబు, దగ్గు ఉన్నప్పుడు మసాలాలు దట్టించకుండా చికెన్ సూప్, లేదా చికెన్ కూర వండుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
3. మధుమేహ రోగులకు చికెన్ ఎంతో మేలు చేస్తుంది. అయితే అధికంగా మాత్రం తినకూడదు.
4. కోడిమాంసంలో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను అడ్డుకుంటుందని చాలా అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి చికెన్‌కు క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి ఉన్నట్టే లెక్క.
5. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు కోడిమాంసం చాలా అవసరం. శరీర అవయవాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి చికెన్ అందిస్తుంది. వారానికి రెండుసార్లయినా చికెన్ తినడం చాలా అవసరం.
6. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారిలో చాలా మంది చికెన్ తినడం మానేస్తారు. కానీ దీన్ని తినడం వల్ల ఇంకా వేగంగా బరువు తగ్గుతారు. చికెన్ లో ప్రోటీన్లు ఉంటాయి. బరువు నిర్వహణకు ఇవి చాలా అవసరం.
Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ