News
News
X

పురాతన మానవులు ఎందుకు అంతరించిపోయారు?

ఒకప్పుడు భూమ్మీద జీవించిన నియాండర్తల్‌ కొంత కాలం తర్వాత అంతరించిపోయారు. ఆధునిక మానవుల మాదిరిగానే ఉన్నా.. ఎందుకు వీళ్లు మనుగడ కొనసాగించలేకపోయారు? అనే పరిశోధనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.

FOLLOW US: 

నియాండర్తళ్ళు.. యురేషియాలో సుమారు 40వేల సంవత్సరాల క్రితం వరకు నివసించి, అంతరించిపోయిన పురాతన మానవుల జాతి.  వలస వచ్చిన ఆధునిక మానవులతో పోటీ పడలేక, లేదంటే శీతోష్ణస్థితుల్లో వచ్చిన పెను మార్పులు, లేదంటే పలు రకాల వ్యాధుల మూలంగా ఈ జాతి అంతరించిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. DNA అధ్యయనాల్లో 1,82,000 సంవత్సరాల క్రితం నుంచి 80,000 సంవత్సరాల క్రితం వరకు నియాండర్తళ్ళు జీవించి ఉండొచ్చని తేలింది. నియాండర్తళ్ళు అంతరించి పోవడానికి గల కారణాలపై పరిశోధనలు విస్తృతంగా కొనసాగాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో పలు కీలక విషయాలు వెల్లడి అవుతూనే ఉన్నాయి.  

న్యూరాన్ల ఉత్పత్తిలో తేడా ఎందుకు?

ఒకే జన్యు పరివర్తనతో ఆధునిక మానవులకు నియాండర్తళ్ళు దగ్గరి బంధువులుగా గుర్తించారు. అయితే, నియాండర్తళ్ళ తో పోల్చితే ఆధునిక మానవులలో ఎక్కువ న్యూరాన్‌లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉందని తేలింది. మెదడు అభివృద్ధి సమయంలో మెదడు పరిమాణంతో పాటు న్యూరాన్ ఉత్పత్తిలో పెరుగుదల మానవ పరిణామ సమయంలో సంభవించినట్లు తేలింది. దీని మూలంగానే గత తరాలతో పోల్చితే కొత్త తరాల వారిలో మేధోశక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నియాండర్తళ్ళు, ఆధునిక మానవులు ఇద్దరికీ ఒకే పరిమాణంలో మెదడు అభివృద్ధి జరిగినప్పుడు.. ఇరువురిలో న్యూరాన్ ఉత్పత్తి పరంగా ఎలా తేడాలు వచ్చాయనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.   

మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ (MPI-CBG) పరిశోధకులు న్యూరాన్ ఉత్పత్తి విషయంలో తేడాల గురించి కీలక పరిశోధన చేశారు. TKTL1 ప్రోటీన్ కు సంబంధించి ఆధునిక మానవ రూపాంతరం, నియాండర్తల్ వేరియంట్ నుంచి ఒకే అమైనో ఆమ్లం ప్రోటీన్‌ల బిల్డింగ్ బ్లాక్‌లను పెంచుతుందని కనుగొన్నారు. ఆధునిక మానవ మెదడు పుట్టుకకు కారణంమైన కణాల రకం బేసల్ రేడియల్ గ్లియా. ఈ  బేసల్ రేడియల్ గ్లియల్ కణాలు అభివృద్ధి చెందుతున్న నియోకార్టెక్స్‌ లో మెజారిటీ న్యూరాన్‌ లను ఉత్పత్తి చేస్తాయి. ఇది మెదడులోని అనేక జ్ఞాన సామర్థ్యాలకు అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.   

నియాండర్తళ్ళు కంటే ఆధునిక మానవులలో న్యూరాన్ల ఉత్పత్తి ఎక్కువ

మానవ పిండం అభివృద్ధి సమయంలో న్యూరాన్ల ఉత్పత్తి నియాండర్తళ్ళ కంటే ఆధునిక మానవులలో ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ న్యూరాన్ ల ఉత్పత్తి జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది ఆధునిక మానవుల విజ్ఞాన సామర్థ్యాలను ప్రోత్సహించి ఉండవచ్చన్నారు. అందుకే ఆధునిక మానవులు పరిణామ క్రమాలను దాటుకుంటూ ముందుకు సాగగా.. నియాండర్తళ్ళు అంతరించిపోయి ఉంటారని భావిస్తున్నారు.

Published at : 19 Sep 2022 06:11 PM (IST) Tags: Neanderthals Gene mutation modern humans neurons

సంబంధిత కథనాలు

కళ్లు ఎర్రగా మారుతున్నాయా? అస్సలు అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే..

కళ్లు ఎర్రగా మారుతున్నాయా? అస్సలు అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే..

Cancer: వెన్నునొప్పి వస్తే తేలికగా తీసుకోవద్దు, అది ఈ మూడు క్యాన్సర్ల లక్షణం కావచ్చు

Cancer: వెన్నునొప్పి వస్తే తేలికగా తీసుకోవద్దు, అది ఈ మూడు క్యాన్సర్ల లక్షణం కావచ్చు

Michigan Lottery: భార్య చెప్పిన మాట వింటే ఇదిగో ఇలా రూ. 1.5 కోట్ల లాటరీ గెలవొచ్చు!

Michigan Lottery: భార్య చెప్పిన మాట వింటే ఇదిగో ఇలా రూ. 1.5 కోట్ల లాటరీ గెలవొచ్చు!

Gandhi Jayanti: మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ వెరీ వెరీ స్పెషల్! శరీరానికే కాదు, మానసిక శక్తిని అందిస్తుంది

Gandhi Jayanti: మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ వెరీ వెరీ స్పెషల్!  శరీరానికే కాదు, మానసిక శక్తిని అందిస్తుంది

Blood Diamonds: ఆ దేశంలో వజ్రాలు విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

Blood Diamonds: ఆ దేశంలో  వజ్రాలు  విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!