అన్వేషించండి

Gen Z Health Alert : Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే

Youngsters Health In Danger : అమ్మా తలనొప్పి వస్తుంది అంటే చాలామంది రెగ్యులర్గా వినే మాట హా వస్తాది వస్తాది.. ఫోన్ చూడు అన్ని నొప్పులు వస్తాయి అనే ఆన్సర్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యువతలో పెరుగుతున్న మెడ, నడుము, కాళ్ల నొప్పులకు స్క్రీన్ టైమ్ కారణం.
  • గంటల తరబడి ఫోన్, ల్యాప్ టాప్ వాడకం భంగిమను దెబ్బతీస్తుంది.
  • వ్యాయామం, తగినంత నిద్ర లేకపోవడం కండరాల బలహీనతకు దారితీస్తుంది.
  • జీవనశైలి మార్పులు, వ్యాయామం నొప్పుల నివారణకు అత్యవసరం.

Gen Z Is Suffering From Neck and Back Pain : ఈరోజుల్లో మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి వంటి సమస్యలు కేవలం పెద్దవారిలోనే కాదు.. యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా Gen Zలు గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్‌ల ముందు గడపడం వల్ల ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, మొబైల్ వాడకంతో సరైన భంగిమలో కూర్చోకపోవడం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే మెడ, వెన్ను, కాళ్ల నొప్పులతో బాధపడే పరిస్థితి వస్తోంది.

మెడ నొప్పికి కారణం

చాలామంది యువత ఫోన్ చూస్తూ గంటల తరబడి తల వంచి కూర్చుంటున్నారు. అలాగే ల్యాప్‌టాప్ ముందు కూడా సరైన భంగిమ లేకుండా పనిచేస్తుంటారు. సరిగ్గా కూర్చోకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది. వీడియో గేమ్స్, సోషల్ మీడియా, టెక్స్టింగ్ వంటి అలవాట్లు కూడా మెడ కండరాలను బలహీనపరుస్తున్నాయి. దీన్ని చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాయామం లేకపోవడం కూడా..

గతంతో పోలిస్తే ఇప్పుడు యువత శారీరకంగా చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. బయట ఆటలు, నడక, అవుట్ డోర్ గేమ్స్ ఆడడం వంటివి తగ్గిపోయాయి. చదువు, పని, వినోదం, గేమ్స్ అన్నీ స్క్రీన్‌కే పరిమితం అవుతున్నాయి. అలాగే రోజంతా ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడుతున్నాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. దీని ప్రభావం నడుము, కాళ్లపై ఎక్కువగా పడుతుంది.

కాళ్ల నొప్పులకు కారణం

ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో.. ముఖ్యంగా కాళ్లలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో కాళ్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే లుక్స్ కోసం అసౌకర్యంగా ఉండే షూస్ వేసుకోవడం, స్ట్రెచింగ్ చేయకపోవడం, నడక లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతున్నాయి. కొందరిలో విటమిన్ D, కాల్షియం లోపం వల్ల కూడా కాళ్ల బలహీనత, నొప్పులు కనిపించొచ్చు.

ఒత్తిడి, నిద్రలేమి ఎఫెక్ట్

చదువులో ఒత్తిడి, కెరీర్ టెన్షన్, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వంటి కారణాల వల్ల చాలామంది యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కండరాల బిగుతుకు కారణమవుతుంది. ముఖ్యంగా మెడ, భుజాల దగ్గర నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రాత్రిళ్లు ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల నిద్ర కూడా సరిగా ఉండదు. సరైన విశ్రాంతి లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది.

నొప్పులు ఎలా దూరం చేసుకోవాలి?

మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలి. మొబైల్, ల్యాప్‌టాప్ వాడేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవాలి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యోగా, స్ట్రెచింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. రాత్రుళ్లు ఫోన్ మానేస్తే మంచిది. వాడినా తక్కువగా వాడితే బెటర్, అలాగే నిద్ర విషయంలో రాజీ పడకూడదు. 

టెక్నాలజీ జీవితాన్ని సులభం చేసింది. కానీ అదే టెక్నాలజీని అతిగా వాడటం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణులు చెప్తోన్నారు. కాబట్టి చిన్న వయసులోనే వచ్చే ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి. లేదంటే భవిష్యత్తులో అవే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget