Ganesh Chaturthi: బిస్కెట్ ప్యాకెట్లు, రుద్రాక్షలతో వినాయకుడి అలంకరణ... ఫుడ్ వేస్టేజ్ పై అవగాహన
5 అడుగుల శివలింగాన్ని తీర్చిదిద్దేందుకు 1008 బిస్కెట్ ప్యాకెట్లు, 850 రుద్రాక్షలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్కెట్లో అమ్మకానికి ఉంచిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి పండుగ చేసుకున్నారు. మరికొందరు ఎకో ఫ్రెండ్లీ అని, మరికొందరు అవగాహన కోసం రకరకాల వినాయక విగ్రహాలను తయారు చేశారు.
Alos Read: vinayaka Chavithi: ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే
గుజరాత్‌కి చెందిన రాధిక సోని ఫుడ్ వేస్టేజ్ పై అవగాహన కల్పించేందుకు వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక మండపాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆమె ఫుడ్ ప్యాకెట్స్‌ని ఎంచుకుంది. 5 అడుగుల శివలింగాన్ని తీర్చిదిద్దేందుకు 1008 బిస్కెట్ ప్యాకెట్లు, 850 రుద్రాక్షలు తీసుకుంది. వీటితో లింగాన్ని ఏర్పాటు చేసి మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచింది. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వినాయకుడి బొమ్మ నిమజ్జనం అనంతరం ఈ బిస్కెట్ ప్యాకెట్లను పూర్ చిల్డ్రన్‌కి అందజేయనున్నట్లు తెలిపింది.
ఫుడ్ వేస్టేజ్ పై తనకు జరిగిన ఓ అనుభవాన్ని ఈ సందర్భంగా రాధిక పంచుకుంది. ఓ సారి తన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే చాలా ఫుడ్ మిగిలిపోయిందట. ఆ ఫుడ్‌ని డొనేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. దేశంలో ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. అందుకే Don't Waste Food అనే మెసేజ్‌తో ఈ సారి వినాయక చవితి వేడుకలు నిర్వహించినట్లు ఆమె తెలిపింది. రాధిక చేపట్టిన ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల వారు హర్షం వ్యక్తం చేశారు.
Alos Read: Divine Flowers: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది?
Food Waste Index Report 2021 ప్రకారం ప్రతి పనిషి ఏడాది 50 కేజీల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన మనదేశంలో పెద్ద మొత్తంలోనే ఫుడ్ వేస్టు అవుతుందన్నమాట. వీలైనంత వరకు ఫుడ్ వేస్టేజ్‌ని కంట్రోల్ చేసేందకు అందరూ తమ వంతు ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా రాధిక కోరింది.