Makar Sankranti 2026 : మకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా? శ్రీరాముడుతో ఉన్న సంబంధం ఇదే
Kite Flying on Sankranti : మకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడమనేది ఎప్పటినుంచో వస్తుంది. అయితే అసలు దీనికి సంక్రాంతికి, శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటో చూసేద్దాం.

Makar Sankranti and Kite Flying : నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలు మకర సంక్రాంతికి చిహ్నంగా ఉంటాయి. ఇవి లేకుండా మకర సంక్రాంతి పండుగ అసంపూర్ణంగా చెప్తారు. భారతదేశంలోని చాలా నగరాల్లో మకర సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. పండుగ రోజు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఇప్పటి నుంచి కాదు.. శ్రీరాముడి కాలం నుంచి కొనసాగుతోంది. మొఘలులతో కూడా దీనికి సంబంధం ఉంది.
గాలిపటానికి శ్రీరాముడితో ఉన్న బంధమిదే
మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడానికి మతపరమైన నమ్మకాలు ఉన్నాయి. రామాయణం ప్రకారం.. మకర సంక్రాంతి రోజున మొదటిసారిగా గాలిపటాన్ని శ్రీరాముడు ఎగురవేశాడు. అతని గాలిపటం చాలా ఎత్తుకు ఎగిరి ఇంద్రలోకం వరకు వెళ్లిందని చెబుతారు. అప్పటి నుంచి మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ప్రారంభమైంది. దీనిగురించి రామచరితమానస్లోని బాలకాండలో ప్రస్తావన ఉంది.
‘రామ్ ఇక్ దిన్ చంగ్ ఉడాయి।
ఇంద్రలోక్ మే పహుంచి జాయి॥
‘రామచరితమానస్’లో తులసీదాస్ శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటాలు ఎగురవేసిన సందర్భాలను ప్రస్తావించారు. ఈ సందర్భం ‘బాలకాండ’లో ఉంది.
గాలిపటం ఎగురవేయడానికి శాస్త్రీయ ఆధారం
మకర సంక్రాంతి నుంచి చలి తగ్గుతుంది. గాలిపటం ఎగురవేయడం ద్వారా చలికాలంలో సూర్య కిరణాలను ఆహ్వానిస్తూ.. శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తారని భావిస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి విటమిన్ డి లభిస్తుంది. చలికాలం ఉదయం గాలిపటం ఎగురవేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
గాలిపటం ఎగురవేయడం వెనుక ఉన్న చరిత్ర
గాలిపటం ఎగురవేయడం వెనుక దాదాపు 2 వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఇది చైనాలో ప్రారంభమైంది. ఆ సమయంలో గాలిపటాన్ని సందేశాలను పంపడానికి ఉపయోగించారు. భారతదేశానికి గాలిపటాన్ని చైనా యాత్రికులు ఫాహియాన్, హ్యూయెన్ త్సాంగ్ తీసుకువచ్చారు. మొదట యుద్ధభూమిలో ఒకరికొకరు సందేశాలు పంపే సంప్రదాయంలో గాలిపటాన్ని ఉపయోగించేవారు. ఢిల్లీలో మొఘలులు గాలిపటం పోటీలను నిర్వహించేవారు. ఆ తర్వాత భారతదేశంలో గాలిపటం క్రమంగా కొత్త ఆటగా గుర్తింపు పొందింది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఉంది. ఇక్కడ ఇది చెప్పడం ముఖ్యం. ABP దేశం ఎటువంటి నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















