సంక్రాంతి సమయంలో ట్రెడీషనల్ వంటకాలు చాలా చేస్తుంటారు.

టేస్టీ టేస్టీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.

2 కప్పుల మినుమలు, 2 టేబుల్​స్పూన్ల బియ్యం దోరగా వేయించుకోవాలి.

మినుములు పొట్టు తీసి పప్పును వేరు చేసి.. బియ్యంతో కలిపి చల్లారనివ్వాలి.

వాటిని మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి.

2 కప్పులు తురిమిన బెల్లం వేసి కలిపి పిండిలో బెల్లం కలిసేందుకు మళ్లీ గ్రైండ్ చేయాలి.

పిండికి సరిపడా నెయ్యి వేడి చేసుకుని దానిలో కలపాలి.

ఇప్పుడు పిండిని ఉండలుగా చుట్టుకుంటే టేస్టీ టేస్టీ సున్నుండలు రెడీ. (All Images Credit : Pinterest)