(Source: ECI/ABP News/ABP Majha)
Friendship Day 2021: అమ్మాయితో హార్ట్ పుల్ గా స్నేహం చేసి చూడండి... మీ మైండ్ సెట్ మారిపోతుంది...
ఆ అమ్మాయి.. ఆ అబ్బాయి మస్తు తిరుగుతారు తెలుసా? ఇలాంటివి చాలానే మాట్లాడుకుంటాం? కానీ.. వాళ్లది నిజమైన ఫ్రెండ్ షిప్ అయితే వాళ్ల మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆలోచించారా?
అమ్మాయి-అబ్బాయి ఫ్రెండ్ షిప్ ఏంట్రా... వాళ్లు కలరింగ్ ఇస్తున్నారు... కచ్చితంగా వాళ్ల మధ్య ఏదో ఉంది. ఏదో రోజు చెప్తారులే. యేహే వాళ్లిద్దరి మధ్య ఏదో కుచ్ కుచ్ హోతా హై. ఇలా బ్యాక్ టాక్ మనం చాలానే వింటూ ఉంటాం. కానీ ఎవరి ఏమోషన్స్ ఏంటా? అనేది ఎదుటి వారికి అవసరం లేదు. ఆ క్షణం ఇద్దరి గురించి మాట్లాడుకున్నామా? ఇంకో నలుగురి చెప్పామా? ఇంతే.
నిజంగా ఫ్రెండ్ షిప్ చేసిన అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే రిలేషన్ వేరు. ఒకరిని వదిలి ఒకరు ఉండగలరేమో గానీ.. ఒకరి మంచి గురించి.. ఒకరు ఆలోచించకుండా ఉండలేరు. ఎందుకంటే ఓదార్చేందుకు పక్కనలేనప్పుడు వాళ్లు కోరుకునేది... ఫ్రెండ్ కి మంచి జరగాలనే..
మీరో అమ్మాయిని లవ్ చేశారనుకోండి. ప్రపోజ్ చేశారు. మీ లవ్ రిజక్ట్ అయింది. అదే మీకున్న ఫ్రెండ్ లిస్టులోని బాయ్ కి చెబితే.. రారా మామా తాగుదాం అంటాడు. ఎక్కువ శాతం మంది గుచ్చిగుచ్చి అడగడానికే ప్రయత్నాలు చేస్తారు. అదే అమ్మాయి ఫ్రెండ్ అయితే ముందు మీరు తిన్నారో లేదో కచ్చితంగా అడుగుతుంది. నువ్వు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చావ్.. అందుకే నీ నెత్తిన కూర్చొంది.. ఓ నాలుగు రోజులు దాన్ని పట్టించుకోకు.. ఎక్కువ ఆలోచించకు అంటు క్లాస్ పీకుతుంది. నువ్ ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటే నీతో మాట్లాడటం మానేస్తా అని గర్ల్ బెస్టీ కౌన్సిలింగ్ చేస్తుంది. మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తే.. ఒక్కటి ఇచ్చి అయినా చెబుతుంది.
మన సమస్యలన్నీ గర్ల్ బెస్టీకి చెప్పుకుంటే.. అమ్మాయి యాంగిల్ లో ఆలోచించి సమాధానాలు వస్తాయి. అదే బాయ్ బెస్టీకి చెబితే.. కచ్చితంగా 90 శాతం మీ యాంగిల్ లోనే సమాధానం వస్తుంది. అమ్మాయి బెస్టీగా ఉంటే ఇద్దరికి.. ఒకరిపై ఒకరికి కేర్ ఎక్కువ. ప్రతి విషయం అడగకపోయినా అర్థం చేసుకుంటారు.
ప్రతి విషయంలో అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్ షిప్ లో ఒకిరికొకరు తోడుంటారు. ఏదైనా సమస్య ఉన్నా.. వెంటనే గుర్తొచ్చి.. వచ్చే సమాధానం కోసం వెయిట్ చేస్తారు. కచ్చితంగా మంచి సమాధానమే వస్తుందని ఆశీస్తారు. అవసరమైతే ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేసే సమయంలోనూ వాళ్లే మీకు తోడుగా ఉంటారు.
మీ ఇద్దరిది నిజమైన స్నేహమే అయినా... చాలామంది ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తారు. అమ్మాయి-అబ్బాయిది నిజమైన స్నేహం అయినప్పుడు వేరే వాళ్లను పట్టించుకోకపోవడమే మంచిది. వాళ్లు వీళ్లు ఏం అనుకుంటారో అనే భయంతో నిజమైన స్నేహాన్ని వదిలిపెడితే మీకే నష్టం. ఎందుకంటే మీకు సమస్యలు వచ్చినప్పుడు మీ ముందుండి నడిచేది నిజమైన స్నేహమే.