అన్వేషించండి

Head Bath: తల స్నానం చేసేటప్పుడు ఈ నాలుగు తప్పులు చెయ్యొద్దు

తలస్నానం ఎలా పడితే అలా చేస్తే అది జుట్టుని బలహీనపరుస్తుంది. అందుకే ఒక పద్ధతి ప్రకారం హెడ్ బాత్ చెయ్యాలి.

సాధారణంగా కొంతమంది వారానికి రెండు లేదా మూడు సార్లు తల స్నానం చేస్తారు. ఇంకొంతమంది మాత్రం రాత్రి వేళ దిట్టంగా కొబ్బరి నూనె పెట్టి పొద్దునే తలస్నానం చేసి ఆఫీసులకి వెళ్లిపోతారు. అయితే ఇలా రోజు తల స్నానం చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. జుట్టు అరబెట్టుకోకుండా గబగబా దువ్వెసుకుని వెళ్లిపోతారు. తలస్నానం చేసేటప్పుడు అందరూ చాలా వరకి కొన్ని తప్పులు చేస్తారు.

నేరుగా హెయిర్ కి షాంపూ అప్లై చేయడం, ఎలా పడితే అలా జుట్టు రుద్దడం చేస్తారు. ఇలా చేస్తే అది జుట్టు నాణ్యత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే విషయం మీద ఎక్కువగా అవగాహన ఉండదు. అందుకే ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడతారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు సమస్యల్ని తీవ్రతరం చేస్తాయి. అందుకే హెయిర్ కేర్ విషయంలో జాగ్రత్తలు అవసరం ఉంది. జుట్టుని సరైన మార్గంలో వాష్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జుట్టు రాలే సమస్యకి చెక్ పెట్టేయవచ్చు.

తరచూ షాంపూ చెయ్యొద్దు

షాంపూ ఖచ్చితంగా జుట్టుని శుభపరుస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టును కదిగేందుకు షాంపూ చేసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ సార్లు మాత్రం చేస్తే అది జుట్టుని బలహీనపరుస్తుంది. షాంపూ ఎక్కువగా చేయడం వల్ల జుట్టులో ఉండే సహజ నూనె, తేమ తగ్గిపోతుంది. దాని వల్ల జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది.

వేడి నీటితో కడగాలి

తలస్నానం గోరువెచ్చని నీటితో చెయ్యాలి. స్కాల్ఫ్ వేడి ఉష్ణోగ్రత వల్ల మాడు, జుట్టు రెండు పొడిగా మారిపోతాయి. ఇది జుట్టు మూలాలని దెబ్బతీస్తుంది. అందుకే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల కండిషన్లు వంటి ఉతపత్తులు స్కాల్ఫ్ లోకి చొచ్చుకుపోయేలా చేసేందుకు సహాయపడుతుంది. మెరుగైన శోషణకి దారి తీస్తుంది. హెయిర్ వాష్ ముందుగా గోరు వెచ్చని నీటితో చేసి చివరగా చల్లని నీటితో ముగించాలి. చల్లని నీళ్ళు జుట్టులో తేమని లాక్ చేస్తాయి.

టవల్ తో జుట్టు రుద్దకూడదు

జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా పెళుసుగా ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే టవల్ తో బాగా రుద్దడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. టవల్ ఉపయోగించి పొడిగా ఉండేలా రుద్దడం వల్ల జుట్టు చిక్కు పడిపోయి చిట్లి పోతుంది. అందుకే కాసేపు గాలికి ఆరబెట్టుకుని ఆ తరవాత జుట్టుని మెల్లగా తుడుచుకోవడం మంచిది. ఇలా సున్నితంగా ఆరబెట్టుకోవడం జుట్టుకి ఆరోగ్యకరం. తల తుడిచేందుకు కఠినమైన టవల్ ని ఉపయోగించకూడదు.

ఉత్పత్తులు తరచూ మార్చవద్దు

జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఉత్పత్తులు మారుస్తూ ఉంటారు. అవి జుట్టుకి అసలు మంచిది కాదు. ఎందుకంటే కొత్త ఉత్పత్తులకి జుట్టు అలవాటు పడకపోతే రాలిపోవడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు ఒకే హెయిర్ వాష్ ఉపయోగించాలి. ఒకే రకమైన షాంపూ లేదా కండిషనర్ కి కట్టుబడి ఉండాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: అలెర్జీ ఉన్నవాళ్ళు పచ్చి క్యారెట్ తినకూడదా? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget