Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి
మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ ఆహారపానీయాలకు దూరంగా ఉండండి. లేకపోతే.. అది సాధారణ లక్షణాలో లేదా వైరస్ లక్షణాలో తెలియక గందరగోళానికి గురవ్వుతారు.
ఒక వైపు సీజనల్ ఫీవర్స్, మరో వైపు కరోనా వైరస్. ఈ సీజన్లో దగ్గు, జలుబు వస్తే.. కరోనా వైరస్ అనే భయం ప్రతి ఒక్కరిలో నెలకొంటోంది. అయితే, మీరు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. మీలో ఆ లక్షణాలు మూడు రోజుల తర్వాత కూడా కొనసాగుతున్నట్లయితే తప్పకుండా కోవిడ్-19 వైరస్ టెస్ట్ చేయించుకోండి. ఈ నేపథ్యంలో మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దగ్గు, జలుబు వేదిస్తున్న సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడే.. అవి త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ వైరస్ సీజన్లో తప్పకుండా దీన్ని ఒక నియమంలా పాటించాలి.
ఫాస్ట్ ఫుడ్ వద్దు: ఫాస్ట్ ఫుడ్స్ దగ్గు, జలుబు సమయంలోనే కాదు.. ఎప్పుడూ తినకూడదు. వాటిలో పోషక విలువలు లేని పదార్థాలు ఉంటాయి. కాబట్టి, దగ్గు, జలుబు సమయంలో వాటికి దూరంగా ఉండటం మంచిది. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడవు. పైగా జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి.
కెఫిన్: దగ్గు, జలుబు సమయంలో కెఫిన్ పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే.. అది గొంతును మరింత పొడిబారేలా చేసి విపరీతమైన దగ్గుకు కారణమవుతుంది. శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ వద్దు: జలుబు సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం అంత మంచిది కాదు. చాలామంది ఆల్కహాల్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందనే కారణంతో తీసుకుంటారు. కానీ, దానివల్ల రోగనిరోధక వ్యవస్థను క్షీణిస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి: దగ్గు, జలుబు సమయంలో శ్లేష్మం మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు శ్లేష్మాన్ని మరింత పెంచేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.
జ్యూస్‌లు వద్దు: దగ్గు, జలుబు ఉన్నప్పుడు జ్యూస్‌లు తీసుకోవద్దు. జ్యూస్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అది తెల్ల రక్త కణాల్లో అనారోగ్యాన్ని తగ్గించే సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. పండ్ల రసాల్లో ఉండే యాసిడ్ గొంతును ఇరిటేట్ చేస్తుంది.
వేపుళ్లు, ఆయిల్ ఫుడ్ వద్దు: వేయించిన చిరుతిళ్లలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయనేది తెలిసిందే. కాబట్టి, చలి కాలంలో వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని మరింత బలహీనపరుస్తాయి.
సీజనల్ ఫీవర్స్, కరోనా వైరస్ లక్షణాలను ఈ విధంగా గుర్తించవచ్చు:
View this post on Instagram