News
News
X

Beauty Tips: పండగ వేళ మెరిసిపోవాలని అనుకుంటున్నారా? ఈ ఆయుర్వేదం టిప్స్ ఫాలో అయిపోండి

ఈ చిట్కాలు పాటించారంటే ఆరోగ్యకరమైన అందం మీ సొంతం అయిపోతుంది.

FOLLOW US: 

పండగల సీజన్ వచ్చేసింది. అమ్మాయిలందరు అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తెగ తిరిగేస్తారు. బోలెడు డబ్బులు వాళ్ళ చేతుల్లో పోసేస్తారు. కృత్రిమంగా తీసుకొచ్చుకున్న ఆ అందం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. మీకు శాశ్వతమైన సహజ సిద్ధమైన అందం కావాలంటే అందరిలోను ప్రత్యేకంగా కనిపించాలంటే పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ సహజమైన అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అందుకు కావలసిందల్లా కేవలం మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడమే.

పండగ హడావుడి, ఆఫీసు పనుల్లో పడి సరైన ఆహారం తీసుకోకపోతే అది మీ ముఖం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫేస్ నిర్జీవంగా మారిపోయి చూసేందుకు కూడా డల్ గా కనిపిస్తారు. బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ మెరుగైన అందాన్ని పొందవచ్చు. అందుకు ఆయుర్వేదం కొన్ని సూచనలు చేసింది. ఆయుర్వేద డిటాక్స్ తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేస్తూ హానికరమైన టాక్సిన్స్ నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. ఈ పండుగ సీజన్ లో మీరు కూడా ఉత్తమ అనుభూతి పొందాలంటే ఇవి పాటించి తీరాల్సిందే. 

ఆయుర్వేద డిటాక్సీఫికేషన్

మనం తీసుకునే ఆహారం కారణంగా శరీరంలో అనేక మలినాలు పేరుకుపోతాయి. వాటిని అంతర్గతంగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని డిటాక్సీఫికేషన్ అంటారు. ఆయుర్వేదం ఆమోదించిన బాడీ డిటాక్స్ ఫాలో అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఈ డిటాక్స్ వల్ల శరీరం నుంచి విషాన్ని, కణజాలం నుంచి అదనపు వాత, పిత్త, కఫ దోషాలని తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ ద్వారా ఈ టాక్సిన్స్ తొలగించబడతాయి.

News Reels

ఆర్గానిక్ ఆహారం తీసుకోవాలి

శుద్ది చేసిన, ప్రాసెస్, ప్యాక్డ్ ఫుడ్, డీప్ ఫై చేసిన ఆహార పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నూనె, ఉప్పు, చక్కెర అధిక వినియోగం శరీరానికి హాని చేసి అనారోగ్య సమస్యలని తీసుకొస్తుంది. అందుకే దాని నుంచి బయట పడాలంటే సేంద్రీయ ఉత్పత్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం కంటే సేంద్రీయ పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి. అదనంగా వీలైనంత వరకు నూనె, ఉప్పు, చక్కెర తీసుకోవడం తగ్గించాలి.

హెర్బల్ టీతో హైడ్రేట్ గా ఉండాలి

టాక్సిన్స్ బయటకి పంపించాలంటే హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. కహ్వా టీ వంటి హెర్బల్ టీ ఒక కప్పు తాగడం ఆరోగ్యానికి అన్నీ విధాలుగా మేలు చేస్తుంది. జీవక్రియని పెంచి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ టీ తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోయి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆకుపచ్చ స్మూతీలు తీసుకోవాలి

స్మూతీలు రుచికరమైనవే కాదు ఆరోగ్యం కూడా. స్మూతీ చెయ్యడానికి ఉపయోగించే బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు చేసుకునే స్మూతీలో దోసకాయ, పాలకూర, బీట్ రూట్, క్యారెట్, యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీలను కూడా జోడించుకోవచ్చు. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయి పెరుగుతుంది. రిఫ్రెష్ గా ఉండటానికి అల్పాహారం లేదా రాత్రి పూట అయినా దీన్ని తీసుకోవచ్చు.

వ్యాయామం కీలకం

వ్యాయామం చేయడం చాలా అవసరం. చెమట పట్టడం అనేది చర్మాన్ని కాలుష్య కారకాల నుంచి విముక్తి చేస్తుంది. ఆర్సెనిక్, సీసం, పాదరసం వంటివి చెమట ద్వారా చర్మం నుంచి బయటకి తొలగించబడతాయి. వ్యాయామం ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడమే కాకుండా హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలోనూ సహాయపడతాయి.

నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి

శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు తప్పనిసరిగా నీళ్ళు తాగాలి. శరీరంలోని మలినాలని పారద్రోలెందుకు నీరు చాలా సహాయపడుతుంది. ప్రతి రోజు 3-4 లీటర్ల నీటిని తాగాలి. నీరు కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కొద్దిగా నారింజ రసం లేదా పుదీనా ఆకులు, స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలను కలపడం ద్వారా పోషకాలను మాత్రమే కాకుండా రుచిగా ఉండే డిటాక్స్ డ్రింక్‌ని కూడా తయారు చేసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: బరువు తగ్గడానికి ఏది తినాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి తింటే నాజూకుగా మారడం ఖాయం

Published at : 22 Oct 2022 10:21 AM (IST) Tags: Skin Care Tips Beauty tips herbal tea Healthy lifestyle Ayurveda Detox Ayurveda Beauty Tips

సంబంధిత కథనాలు

నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదేనా?

నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదేనా?

పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

Lipsticks: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!

Lipsticks: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్