News
News
వీడియోలు ఆటలు
X

Hungry: అతిగా ఆకలి వేస్తుందా? అందుకు ఈ ఐదు సమస్యలే కారణం

ఎంత తిన్నా ఆకలిగానే ఉంటుంది. అది తట్టుకోలేక విపరీతంగా తినేస్తారు. అయితే అంతగా మీకు ఆకలి కావడానికి కారణం ఏంటో తెలుసా?

FOLLOW US: 
Share:

ఆకలిగా అనిపించడం సహజం. కానీ తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిగా ఉంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఆకలిగా అనిపిస్తూనే ఉంటే తలనొప్పి, చిరాకు, దృష్టిని కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సార్లు విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు అతిగా తినేస్తారు. దీని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులుని తెచ్చి పెడుతుంది. మీరు కూడా అతిగా ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే అందుకు ఈ ఐదు ప్రమాదకరమైన సమస్యలే కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడానికి ఆకలి ఉండాలి. అతిగా తినడం, ఆకలిగా ఉండటం రెంటింటిని సమతుల్యం చేయడానికి సరైన పద్ధతులు పాటించాలని వైద్యులు అంటున్నారు. అసలు తరచుగా ఆకలి వేయడానికి గల కారణాలు ముందు తెలుసుకోవాలి. అవేంటంటే...

తగినంత ప్రోటీన్ లేకపోవడం

మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతాయి. ఆకలిని పరిమితం చేస్తాయి. పొట్ట నిండుగా ఉందని సూచించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచడం ద్వారా పని చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 12 వారాల పాటు ప్రోటీన్ తీసుకున్న వారిలో అర్థరాత్రి అల్పాహారం తినకుండా 50 శాతం తగ్గించిందని తేలింది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, విత్తనాలు, తృణధాన్యాలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలని సిఫార్సు చేస్తున్నారు.

తక్కువ ఫైబర్

శరీరంలోని ముఖ్యమైన అవయవాల సాధారణ పనితీరుకి ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం. తగినంత ఫైబర్ తీసుకోకపోతే దీర్ఘకాలికంగా జీర్ణక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని అధిగమించాలంటే పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటి అధిక ఫైబర్ ఆహారాలను తీసుకోవాలి. ఇవి ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంచి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫైబర్ తో కూడిన ఆహారం ఆకలిని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

తగినంత నిద్రలేకపోవడం

ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం, నిద్రలేమి అనేక వ్యాధులకు ప్రధాన కారణం. మెదడు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అప్పుడే గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకలిక్ అనారోగ్యాలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపోకపోతే శరీరం గ్రేలిన్ అనే ఆకలిని పెంచే హార్మోన్ ని విడుదల చేస్తుంది. గ్రేలిన్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆకలిగా ఉంటారు. తగినంత నిద్ర ఉండటం వల్ల సంపూర్ణ భావన కలిగించే మరొక హార్మోన్ లెప్టిన్ సరిపడా ఉండేలా చేస్తుంది.

నీళ్ళు తాగకపోవడం

హైడ్రేషన్ గా ఉండటం చాల ఆముఖ్యం. మెదడు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నీరు సరిగా తాగకపోతే శరీరంలోని శక్తి అంతా హరించేస్తుంది. అలసటగా అనిపిస్తుంది. నీరు తాగకపోతే తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. దాహంగా అనిపించినా కాకపోయినా తప్పనిసరిగా 6-8 గ్లాసుల నీటిని తాగాలి.

ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు తినడం

బయట తినడానికి ఇష్టపడే వాళ్ళు తమ ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవాలి. ప్రాసెస్ చేసిన్ ఆహారాల్లో ఖనిజాలు, పోషకాలు ఉండవు. రొట్టె, పాస్తా వంటి వాటికి ఉపయోగించే తెల్లటి పిండిలో పోషకాలు శూన్యం. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం వాటిని త్వరగా జీర్ణం చేస్తుంది. ఫలితంగా ఆకలిగా అనిపిస్తుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Published at : 27 Mar 2023 05:26 PM (IST) Tags: Sleeping Hydration Hungry Overeat Overeating Reasons

సంబంధిత కథనాలు

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

టాప్ స్టోరీస్

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ