News
News
X

Viral: ‘అందరికీ వాన పడుతోంది, మాకే లేదు’ అంటూ కోపంతో అతనిపైనే కేసు పెట్టిన రైతు, వైరల్ అయిన ఫిర్యాదు

ఓ రైతుకి బాగా కోపం వచ్చింది. అతడు ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

FOLLOW US: 

మనకి ఇక్కడ వానలు కుమ్మేస్తున్నాయి. ఇక్కడేనా దాదాపు పది రాష్ట్రాల్లో వర్షాలు వాయించేశాయి. కానీ అదేంటో ఉత్తరప్రదేశ్ లోన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వానలే లేవు. గోండ్ జిల్లాలోని ఝాలా గ్రామంలో కూడా వర్షాలు సరిగా పడలేదు. ఈ ఏడాదైతే మరీ అధ్వానం. వానలే లేక అక్కడ పంటలన్నీ ఎండిపోయాయి. ఆ గ్రామానికి చెందిన వ్యక్తే సుమిత్ కుమార్ యాదవ్. ఆయన వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్న వ్యక్తి. దేశమంతా వర్షాలు పడుతున్నా తాము మాత్రం ఎండలతో ఎండిపోతున్నమంటూ ఎంతో బాధపడ్డాడు.చివరకి కోపంతో ఓ పని చేశాడు. 

గ్రామాల్లో నెలకోసారి ఫిర్యాదులు స్వీకరించడానికి, సమస్యలు వినడానికి అధికారులు వస్తుంటారు. దీన్నే సంపూర్ణ సమాధాన్ దివస్ అంటారు యూపీలో. సుమిత్ గ్రామంలో కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. అందులో తన ఫిర్యాదును అధికారులకు అందించాడు సుమిత్. అధికారులు కనీసం అతను ఎవరి మీద, ఏం ఫిర్యాదు చేశాడో కూడా చూసుకోకుండా ‘చర్యలు తీసుకోండి’ అంటూ ఆర్డర్ వేశారు. ఆ ఫిర్యాదు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి అధికారులు నాలుక కరచుకున్నారు. 

ఇంతకీ ఎవరిమీద?
అన్నిచోట్లా వానలు పడుతున్న తమ గ్రామంలో, చుట్టుపక్కల మాత్రం వాన చుక్క రాలడం లేదు, ఇది పక్షపాతం చూపించడమే అంటూ సుమిత్ ఏకంగా ఇంద్రుడిపైనే ఫిర్యాదు చేశాడు.వాన దేవుడిని తమ గ్రామానికి పంపించడం లేదన్నది అతడి అభిప్రాయం. ఆ ఫిర్యాదును అందుకున్న జిల్లాలోని ఓ సీనియర్ అధికారి ‘ఇంద్రదేవుడిపై చర్యలు తీసుకోండి’ అని సంతకం చేసి ఇచ్చేశాడంట.  ఆ ఫిర్యాదులో సుమిత్ ‘వానల్లేక అందరం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి  ఇంద్రదేవుడిపై చర్యలు తీసుకోండి’ అని లేఖ రాసి ఇచ్చాడు. ఆ ఫిర్యాదు గ్రామం నుంచి జిల్లా ఆఫీసుకు చేరింది. అక్కడ కూడా కనీసం ఎవరి మీద ఫిర్యాదు చేశాడో చూసుకోలేదు అధికారులు. ఇప్పుడు విషయం బయటపడ్డాక మాత్రం తాము ఆ ఫిర్యాదుపై  చర్యలు తీసుకోమని సిఫారసు చేయలేదని చెప్పుకుంటున్నారు జిల్లా అధికారులు. 

Also read: ఈ కోడిగుడ్ల నిండా యాంటీబాడీలే, కొత్తగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇవి తింటే కరోనా నుంచి సేఫ్

Also read: ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉన్న మరో వైరస్ మహమ్మారి ‘మార్బర్గ్’, ఇది కూడా ఎబోలా లాంటిదే, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also read: ‘పొమాటో’ మొక్కకు కాసిన ‘బ్రిమాటో’ కూరగాయ ఇదిగో, వండుకుని తింటే ఆ రుచే వేరు

Published at : 19 Jul 2022 03:10 PM (IST) Tags: Viral video Viral news Trending Viral Photos

సంబంధిత కథనాలు

Antibiotics: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?

Antibiotics: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?

Diabetes: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు

Diabetes: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు

Methi: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే

Methi: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

టాప్ స్టోరీస్

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'