Face Cleanup vs Facial : పార్లర్లో ఫేస్ క్లీన్అప్ చేయించుకోవడం మంచిదా? ఫేషియల్ చేయించుకుంటే బెటరా?
Face Cleanup or Facial at the Parlour : ఫేస్ డల్‌గా ఉన్నా.. ఏదైనా ఫంక్షన్ ఉన్నా చాలామంది పార్లర్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్లినప్పుడు ఫేస్ క్లీన్అప్ చేయించుకోవడం మంచిదా? ఫేషియల్ చేయించుకోవడం బెటరా?

- క్లీనప్ మురికి, జిడ్డు తొలగిస్తే, ఫేషియల్ మసాజ్, మాస్క్ కలిగి.
- జిడ్డు చర్మానికి క్లీనప్, పొడి చర్మానికి హైడ్రేటింగ్ ఫేషియల్ సూచించబడింది.
- ఫంక్షన్ ముందు కొత్త ఫేషియల్స్, సున్నిత చర్మం వారు జాగ్రత్త.
Face Cleanup Or Facial Before Function : చర్మాన్ని క్లీన్‌గా చేసుకునేందుకు.. ఫేస్ ఫ్రెష్‌గా కనిపించేందుకు చాలామంది పార్లర్‌కు వెళ్లి ఫేస్ క్లీన్అప్ లేదా ఫేషియల్ చేయించుకుంటారు. అయితే కొందరు ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండూ పూర్తిగా డిఫరెంట్. మరి ఏ చర్మానికి ఏది చేయించుకుంటే మంచిది.. క్లీన్ అప్ వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఫేషియల్ ఎవరు చేయించుకుంటే బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లీన్అప్ అంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, ఆయిల్‌ను తొలగించడం కోసం బెస్ట్ ఆప్షన్. ఫేషియల్‌లో క్లీనింగ్‌తో పాటు మసాజ్, మాస్క్ వంటి అదనపు దశలు ఉంటాయి. మీ చర్మానికి ఏది సరిపోతుంది? ఎప్పుడు క్లీన్అప్, ఎప్పుడు ఫేషియల్ చేయించుకోవాలో చూసేద్దాం.
Also Read : ఎండలో తిరిగి ట్యాన్ అయ్యారా? ఈ ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లతో చర్మానికి మళ్లీ మెరుపు తీసుకురండి
ఫేస్ క్లీన్అప్
ఫేస్ క్లీన్అప్లో సాధారణంగా ముఖాన్ని శుభ్రం చేయడం, ఎక్స్ఫోలియేషన్, స్టీమ్, బ్లాక్‌హెడ్స్ లేదా వైట్‌హెడ్స్ తొలగించడం వంటి దశలు ఉంటాయి. చర్మంపై పేరుకుపోయిన మురికి, అదనపు ఆయిల్‌ను తొలగించడానికి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. డల్‌నెస్ పోగొట్టుకోవాలనుకునేవార దీనిని ఎంచుకోవచ్చు.
ఫేషియల్
ఫేషియల్‌లో క్లీన్అప్ కంటే ఎక్కువ దశల్లో చేస్తారు. దీనిలో క్లీనింగ్, ఎక్స్ఫోలియేషన్తో పాటు చర్మానికి తగిన మసాజ్, సీరమ్ లేదా ఫేస్ మాస్క్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఏ రకమైన ఫేషియల్ చేస్తున్నారనే దానిపై ఈ దశలు మారుతుంటాయి.
Also Read : ముఖంపై ట్యాన్, డల్‌నెస్ పెరిగిందా? అయితే శనగపిండి-నిమ్మకాయ ఫేస్‌ప్యాక్‌తో చెక్ పెట్టేయండి
ఆయిలీ స్కిన్ ఉంటే ఏది బెస్ట్..
చర్మం ఎక్కువగా ఆయిలీగా ఉంటే ప్రతిసారీ హెవీ ఫేషియల్ అవసరం ఉండదు. సరైన క్లీనప్ ద్వారా అదనపు ఆయిల్, మురికి తొలగించుకోవచ్చు. మొటిమలు ఎక్కువగా ఉంటే పార్లర్లో అతిగా స్క్రబ్ చేయించుకోవడం లేదా మొటిమలను గట్టిగా నొక్కించడం మంచిది కాదు.
డ్రై స్కిన్ అయితే?
చర్మం పొడిగా, బిగుతుగా అనిపిస్తే చర్మ రకానికి సరిపోయే హైడ్రేటింగ్ ఫేషియల్ ఉపయోగపడొచ్చు. అయితే ఫేషియల్ పేరుతో ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల పొడిబారడం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డ్రై స్కిన్‌కు మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ ఉత్పత్తులు ఉపయోగించే విధానాన్ని ఎంచుకోవాలి.
Also Read : చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉంటే?
ముక్కు, గడ్డం ప్రాంతాల్లో బ్లాక్‌హెడ్స్ లేదా వైట్‌హెడ్స్ ఎక్కువగా ఉంటే క్లీన్అప్లో భాగంగా వాటిని తొలగించే ప్రక్రియ చేస్తారు. కానీ చర్మాన్ని గట్టిగా నొక్కడం వల్ల ఎరుపు, గాయాలు లేదా మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవం ఉన్నవారితే చేయించుకోవడం మంచిది.
ఫంక్షన్‌కి వెళ్లే ముందు ఏది బెటర్ అంటే..
ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లే ముందు ముఖం ఫ్రెష్‌గా కనిపించాలని మాత్రమే అనుకుంటే సాధారణ క్లీన్అప్ సరిపోతుంది. ఫేషియల్ చేయించుకోవాలనుకుంటే కొత్త ప్రొడక్ట్స్‌ను చివరి నిమిషంలో ట్రై చేయకపోవడం మంచిది. ఏదైనా ప్రొడక్ట్‌కు అలర్జీ లేదా ఇరిటేషన్ వస్తే ఫంక్షన్ సమయంలో ఇబ్బంది కావచ్చు.
Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి
సెన్సిటివ్ స్కిన్ ఉంటే..
సెన్సిటివ్ స్కిన్, యాక్టివ్ మొటిమలు, ఎగ్జిమా, రోసేసియా లేదా చర్మంపై ఇరిటేషన్ ఉన్నప్పుడు క్లీన్అప్ లేదా ఫేషియల్ సురక్షితం కాదు. ముఖ్యంగా గట్టిగా స్క్రబ్ చేయడం, ఎక్కువగా స్టీమ్ ఇవ్వడం లేదా యాక్టివ్ పదార్థాలు ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల సమస్య పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
Also Read : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























