అన్వేషించండి

Best Spots in Maharashtra : వర్షాకాలంలో మహారాష్ట్రలో చూడాల్సిన ప్రదేశాలివే.. ఈ 8 బెస్ట్ స్పాట్స్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి

Monsoon Trips : మాన్​సూన్​లో ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు మహారాష్ట్రకు వెళ్లొచ్చు. ఈ సమయంలో అక్కడ చూడగలిగే ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? బెస్ట్ ఎక్స్​పీరియన్స్​ కోసం ట్రై చేయండి.

Monsoon Destinations in Maharashtra : వర్షాలు పడే సమయంలో ప్రకృతిని చూడాలి.. ఎంజాయ్ చేయాలని ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు వేరే దేశం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే మహారాష్ట్రకి ట్రిప్​కి వెళ్లొచ్చు. ఇక్కడ మిమ్మల్ని ప్రకృతితో కట్టిపడేసే దృశ్యాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రదేశాలు మీకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే మీరు మహారాష్ట్ర వెళ్తే.. తప్పకుండా చూడాల్సిన 8 బెస్ట్ స్పాట్స్ ఇవే.

లోనావల & ఖండాలా (Lonavala & Khandala)

లోనావల, ఖండాలా అనేది మోస్ట్ పాప్యులర్ రొమాంటిక్, ఫ్యామిలీ డెస్టినేషన్​గా ఎన్నో ఏళ్ల నుంచి గుర్తింపు పొందింది. ఇక్కడ మీరు బుషీ డ్యామ్, టైగర్ లీప్, రాజ్మాచీ కోట, లోహగడ్ ట్రెక్కింగ్​కి వెళ్లొచ్చు. చాయ్‌-పకోడి స్టాల్స్‌ బాగా ఆకట్టుకుంటాయి.

సవియా ఘాట్ (Saviya Ghat)

ఇక్కడి అందమైన కొండలు, పొగమంచుతో కూడిన రోడ్లు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. అంతేకాకుండా లాంగ్ డ్రైవ్​కి వెళ్లాలనుకునేవారికి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరుకుతుంది. 

తంహిని ఘాట్ (Tamhini Ghat)

తంహిని ఘాట్​ వర్షాకాలంలో పూర్తిగా పచ్చదనంతో నిండిపోతుంది.  జలపాతాల అందాలు, అడవి దారులు, మల్షీ డ్యామ్, దేవ్​కుండ జలపాతాలు ఇక్కడ ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. జల్లులు పడే సమయంలో పొగమంచుతో కూడిన అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. 

మహద్ (Mahad)

పచ్చదనంతో నిండి ఉంటే ఈ చారిత్రాత్మక పట్టణం.. రాయ్​గడ్ కోటకు ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఈ ప్లేస్​కి వెళ్తే మీరు చుట్టూ ఉండే ప్రకృతి అందాలతో పాటు.. ఫోర్ట్​లో టైమ్ స్పెండ్ చేయవచ్చు. 

మాల్షెజ్ ఘాట్ (Malshej Ghat)

ఇది ముంబై లేదా పూణె నుంచి 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్నో జలపాతాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఫ్లెమింగో బర్డ్స్​ కూడా చూడవచ్చు. పింపళ్​గావ్ జోగా డ్యామ్, శివనేరి కోటర, వాటర్​ఫాల్స్ మీకు మంచి వ్యూలను అందిస్తాయి. 

సతారా – కాస్ పీట (Kaas Plateau) 

కాస్ పీటను మహారాష్ట్రలో 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్' అని పిలుస్తారు. ఎందుకంటే జూలై చివరి నుంచి సెప్టెంబర్ మధ్య వరకు పువ్వులతో ఈ ప్రదేశం రంగుల పండుగలా మారుతుంది. తోషెఘర్ జలపాతాలు 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ.. కళ్లకు ఆనందాన్ని ఇస్తాయి.

వీటితో పాటు కాలుష్యం లేని మాతెరన్​కి, మహబలేశ్వర్ వంటి ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చు. అయితే మీరు ఈ ప్రదేశాలకు వెళ్లేముందు అక్కడ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకుని ప్రయాణం చేస్తే మంచిది. లేకుంటే జారిపోవడం, పొగమంచు ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఎదుర్కోవచ్చు. అలాగే రెయిన్ జాకెట్స్, వాటర్ ప్రూఫ్ షూలు, స్నాక్స్ తీసుకువెళ్తే మంచిది. ట్రిప్​ సమయంలో ఇబ్బంది కలుగకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకెళ్తే మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget