అన్వేషించండి

Cholesterol Care : అధిక కొలెస్ట్రాల్​కు ఇంటి భోజనం మంచి ఔషదమట.. ఉదయాన్నే అవి తింటే ఇంకా మంచిది

Healthy Diet : మీకు తెలుసా? ఇంట్లో వండిన ఆహారంతో కొలెస్ట్రాల్​ కంట్రోల్ అవుతుందని. ఉదయాన్నే ఇంట్లో చేసుకునే పలు రకాల బ్రేక్​ఫాస్ట్​లు కొవ్వును తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయట.

Cholesterol Diet : కొలెస్ట్రాల్​ ఉంటే ఫుడ్ కంట్రోల్ చేసి.. పచ్చి ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ నోరు కట్టేసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అయితే కేవలం ఇవే కాకుండా ఇండియన్ ఫుడ్.. ముఖ్యంగా ఇంట్లో చేసుకునే కొన్ని బ్రేక్​ఫాస్ట్​లు కూడా అధిక కొలెస్ట్రాల్​కు ఔషదంలా పని చేస్తాయట. వాటిని ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటే డబుల్ బెనిఫిట్స్ పొందవచ్చు అంటున్నారు నిపుణులు. 

అధి కొలెస్ట్రాల్​ వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మందులు మాత్రమే కాకుండా.. ఇంట్లో తయారు చేసుకోగలిగే టేస్టీ, హెల్తీ ఫుడ్ కూడా మంచి హెల్ప్ చేస్తుంది అంటోంది ఆయుర్వేదం. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందట. కాబట్టి వారు తీసుకునే బ్రేక్​ఫాస్ట్​లో కచ్చితంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఉండాలి. 

ఇంట్లో చేసుకునే అనేక వంటకాల్లో పోషకాలు కలిగిన ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవి పోషకాలను మాత్రమే కలిగి ఉండకుండా మంచి రుచిని కూడా మనకి అందిస్తాయి. కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను కంట్రోల్ చేయడంలో ఎలాంటి బ్రేక్​ఫాస్ట్​లను డైట్​లో చేర్చుకోవచ్చో.. అవి ఏవిధంగా కొలెస్ట్రాల్​ స్థాయిలను కంట్రోల్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉప్మా.. 

ఉప్మా అంటే చాలామంది అబ్బా వద్దు అనేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఇదో రుచికరమైన, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ అని వారికి తెలియదు. ఎందుకంటే ఉప్మాలో ఫైబర్, విటమిన్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా దీనిలోని ఇతర పోషకాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వారంలో ఒకటి లేదా రెండుసార్లు అయినా దీనిని మీరు తీసుకోవచ్చు. 

అటుకుల పోహా

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి అటుకుల పోహా అనేది మంచి బ్రేక్​ఫాస్ట్​ అంటున్నారు నిపుణులు. పోహాలోని ఫైబర్​ అధిక కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం తగ్గిస్తుంది. దీనిని కూడా మీరు వారంలో రెండుసార్లు హ్యాపీగా తీసుకోవచ్చు. 

ఇడ్లీ సాంబార్

బ్రేక్​ఫాస్ట్​ కాంబినేషన్ అంటే గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉండేందుకు హెల్తీ ఎంపిక కూడా. అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవాలనుకునేవారు ఈ బ్రేక్​ఫాస్ట్​ను మీ డైట్​లో యాడ్ చేసుకోవచ్చు. సాంబార్​లో పప్పు, కూరగాయలు, సహజమైన మసాలా దినుసులను ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇదే కాకుండా ఇడ్లీలు కూడా బాగా కొలెస్ట్రాల్​ తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే మంచి హెల్తీ బ్రేక్​ఫాస్ట్​తో రోజును ప్రారంభించండి. ఇవి మంచివే కదా బయటకెళ్లి తినడం కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే సమస్య కంట్రోల్​లో ఉంటుంది. అంతేకాకుండా ఏది తీసుకున్నా దానిని లిమిట్​గా తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు.  

Also Read : తెలంగాణ స్పెషల్ కొబ్బరి వడ.. టేస్టీగా చేసుకోగలిగే ఈజీ రెసిపీ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget