News
News
X

Viral video: ఓ అమ్మాయ్! నీలాగే నేనూ డ్యాన్స్ చేస్తానంటున్న ఏనుగు!!

చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. వారితో ఆడుకోవాలని ఉంటుంది. అలాగే.. ఓ ఏనుగు సైతం చిన్నారి డ్యాన్స్ కు ఫిదా అయ్యింది. తను కూడా పాప లాగే డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించింది.

FOLLOW US: 

ఏనుగులు చూడ్డానికి భారీ పరిమాణంలో ఉన్నా.. వాటి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మనుషులతో ఎంతో ప్రేమగా మెలుగుతాయి. ఆయా సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందిని కాపాడి ప్రాణదాతలుగా నిలిచిన వీడియోలు నెట్టింట్లో చాలానే కనిపిస్తాయి. చిన్నారులతో సరదాగా ఉండే వీడియోలు కూడా తరుచుగా చూస్తుంటాం. వారితో కలిసి ఫుట్ బాల్ ఆడటం, సరదా సరదా ఆటలు ఆడటం ఇప్పటికే చూశాం. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఏనుగు చిన్నారితో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.   

ఈ వీడియోలో ఓ ఏనుగును మావటి పట్టుకుని ఉంటాడు. ఏనుగుకు ఎదురుగా ఓ చిన్నారి ఉంటుంది. పెద్ద ఏనుగును చూసి ఎంతో సంతోష పడుతుంది. ఏనుగును దగ్గర నుంచి చూశాననే ఆనందంలో మునిగిపోయి డ్యాన్స్ చేస్తుంది. తన చేతులను, కాళ్లను కదుపుతూ సంతోషాన్ని వ్యక్త పరుస్తుంది. అమ్మాయి పడుతున్న సంతోషాన్ని ఏనుగు గమనిస్తుంది. అమ్మాయి వేసిన స్టెప్పులను తను కూడా వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, అమ్మాయి కాళ్లు, చేతులను ఊపితే.. ఏనుగు మాత్రం తన చెవులను, తొండాన్ని అటూ ఇటూ తిప్పుతుంది. అచ్చం అమ్మాయి డ్యాన్స్ చేసినట్లు గానే ఏనుగు సైతం అనుకరించి చూపిస్తుంది.

ఈ చక్కటి వీడియో  ‘క్యూట్ వైల్డ్ టీవీ’ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయబడింది. “లవ్ లవ్ లవ్ లవ్ లవ్ యు ఏనుగు” అని క్యాప్షన్ రాసింది. ఇప్పుడు 7.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 456k లైక్‌లతో వైరల్‌గా మారింది. అటు ఇదే వీడియోను ఇటీవల ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌ లో రీషేర్ చేసారు. “ఎవరు బెటర్ గా చేశారు?” అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనికి 29.3Kకి పైగా వ్యూస్ వచ్చాయి.  ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరూ అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరిని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Published at : 19 Sep 2022 03:06 PM (IST) Tags: Viral video Girl Dancing Elephant Dancing

సంబంధిత కథనాలు

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !