Peanut Butter: బ్రెడ్ పై పీనట్ బటర్ పూసుకుని తింటున్నారా? దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసా?
Peanut Butter: బ్రెడ్, పీనట్ బటర్ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. రోజూ తినే వాళ్లు కూడా ఉన్నారు.
Peanut Butter: సులువుగా రెడీ అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌లనే తినేందుకే ఇష్టపడతున్నారు ఎక్కువ మంది. వాటివ మొదటిస్థానంలో ఉండే బ్రెడ్ - పీనట్ బటర్ కాంబినేషన్. బ్రెడ్ పై పీనట్ బటర్ రాసుకుని తినేస్తే బ్రేక్ ఫాస్ట్ అయిపోయినట్టే. వండే పనే లేదు. చాలా సింపుల్ గా పొట్ట నిండిపోతుంది. పిల్లలకు పీనట్ బటర్‌ని అలవాటు చేశారు తల్లులు. దీని రుచి బావుంటుంది. అందుకే పిల్లలు, పెద్దలు కూడా త్వరగానే దీనికి అలవాటు పడిపోతారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేక కీడు చేస్తుందా? అని. ఈ విషయం గురించి ఆలోచించే వాళ్లు చాలా తక్కువ. పీనట్ బటర్ మితంగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయి. రోజుకో అరస్పూను చాలు. రోజూ రెండు, మూడు స్పూనులు తినడం వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది.
1. పీనట్ బటర్‌లో ఒమెగా 6 అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి పరిమితంగా అవసరం. కానీ అధికంగా ఒంట్లో చేరడం వల్ల శరీరానికి హనికరం. ఒమెగా 6 అనేది మన శరీరంలో ఉన్న ఒమెగా 3 కన్నా అధికంగా ఉండకూడదు. ఈ పరిస్థితి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.
2. పీనట్ బటర్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. రోజూ తినడం వల్ల, అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి అరస్పూను కన్నా ఎక్కువ బ్రెడ్ పై వేసుకుని తినకూడదు.
3. పీనట్ బటర్లో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిని తగ్గించడంలో ముందుంటుంది. ఈ రెండూ అరుపులో ఉంటే మీ గుండె ఆరోగ్యంగానే ఉంటుంది.
4. దీనిలో అధిక శాతంలో కొవ్వులు ఉంటాయి. వీటి వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. ఇది గుండెల్లో మంటకు దారితీస్తుంది.ఈ కొవ్వులు అన్నవాహికలో చాలా అసౌకర్యానికి దారితీస్తాయి.
లాభాలు ఇవిగో...
పీనట్ బటర్ రోజుకో అరస్పూను లేదా స్పూను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన నూనెలు లభిస్తాయి. దీన్ని తినడం వల్ల డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది. అలాగు గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పీనట్ బటర్ వల్ల కొంతమంది అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు దీని వల్ల కలిగే అలెర్జీ ఉందో లేదో చూసుకుని అప్పుడు తినడం ముఖ్యం.
Also read: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు
Also read: యాభై శాతం భారతీయ ఉద్యోగులు ఇందుకే రాజీనామా చేస్తున్నారు, సర్వేలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.