Hair Fall Control Food: హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో విసిగిపోయారా? అయితే ఈ ఫుడ్స్ తినండి
జుట్టు రాలే సమస్య అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక కారణాలతో జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంటుంది.
వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో జుట్టు కూడా అంతే ప్రభావితం అవుతుంది. మాన్ సూన్ సీజన్ లో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ వాతావరణ పరిస్థితుల వల్ల చాలా మందికి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ఆయిల్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనాలు పొందటం మాట అలా ఉంచితే మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి మీకు కూడా ఎదురవుతుందా? వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుండటం వల్ల విసిగిపోయారా? ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా జుట్టు రాలడం ఆగిపోలేదా? అయితే జింక్ అధికంగా ఉంటే ఆహారాన్ని తిని చూడండి. మీ జుట్టు రాలిపోవడం ఆగిపోయి సహజమైన ఆకృతిని, నాణ్యతని అందిస్తుంది. హెల్తీ హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగపడే కొన్ని ఫుడ్స్ ఇవి.
జింక్ అంత అవసరమా?
జింక్ అనేది ముఖ్యమైన ఖనిజం. జుట్టు పెరుగుదల, రిపేర్ కి దోహదపడుతుంది. శరీరంలోని వివిధ వీధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధించి కొత్త జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
గుడ్లు
గుడ్లు అమైనో ఆమ్లాలు, జింక్ గొప్ప మూలం. జుట్టు రాలడాన్ని అపుతాయి. గుడ్డు మాస్క్ గా జుట్టుకి వేసుకుంటే పోషణ అందుతుంది. జుట్టు పెరుగుదలని పెంచుతుంది.
నువ్వులు
నువ్వుల్లో జింక్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలని పెంచుతాయి. నువ్వుల నూనె జుట్టుకి బాగా పట్టించి మసాజ్ చేసుకుంటే కుదుళ్ళకి కావాల్సిన పోషణ లభిస్తుంది. ఈ నూనె జుట్టుని పెంచేందుకు సహాయపడుతుంది.
కాయధాన్యాలు
ప్రోటీన్ వీటిలో సమృద్ధిగా ఉండటమే కాదు జింక్ ను అందిస్తుంది. సూప్, కూరలు, సలాడ్ తో పాటు అనేక విధాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. జుట్టు రాలడం, బలహీనమైన వెంట్రుకలు రిపేర్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
గుల్లలు
గుల్లలు వంటి సీ ఫుడ్ జింక్ అందించే ఉత్తమ ఆహార వనరులలో ఒకటి. వీటిలో జింక్ తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలని పెంచుతాయి. ఇవి జుట్టు పెరుగుదలని పెంచడంలో సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లో సహజంగా జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటి జుట్టుకి ఆరోగ్యకరమైన పోషకాలని అందించేవి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపి కొత్త జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం..
జుట్టు పెరుగుదలని పెంచడానికి సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన విటమిన్లు ఏ, సి, ఇ వంటి పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు జింక్ అధికంగా ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి పెరుగుతుంది. సీజనల్ హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పనస విత్తనాలని పక్కన పడేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial