అన్వేషించండి

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Weight Loss Fruits: బరువు పెరగడం సులువు కానీ తగ్గడం అంత ఈజీ కాదు. మీ ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.

Fruits for Weight Loss: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. పెరుగుతున్న బరువు వల్ల ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అందువల్ల, బరువును సకాలంలో నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. అంతేకాదు ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మీరు మీ ఆహారంలో చేర్చుకునే అంశాలు మీ బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగాలని చెబుతుంటారు. అంతే కాకుండా రోజూ ఉదయాన్నే కొన్ని పండ్లను తినడం ద్వారా కూడా పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఆ పండ్లు ఏవో తెలుసుకుందాం. 

ద్రాక్ష:

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ద్రాక్షలో పుష్కలంగా ఉన్నాయి. ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో ద్రాక్షను తింటే, అది ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఈ పండు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

యాపిల్స్:

రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ తో అవసరం ఉండదు అంటారు. యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో యాపిల్స్ సహాయపడతాయి. యాపిల్స్ లో ఉండే పాలీఫెనాల్స్ బరువును తగ్గిస్తాయి. అంతేకాదు యాపిల్ పీల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు ఊబకాయన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఆకలిని కూడా తగ్గిస్తుంది. 

బెర్రీలు:

బెర్రీలు చాలా జ్యుసి, రుచికరమైనవి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. మీరు దీన్ని ఉదయం అల్పాహారంగా తినవచ్చు. మీరు స్ట్రాబెర్రీలను సలాడ్ లేదా స్మూతీకి జోడించడం ద్వారా కూడా తినవచ్చు. 

కివి:

కివీలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్-ఇ, పొటాషియం, కాపర్, సోడియం, యాంటీఆక్సిడెంట్ గుణాలు  ఉన్నాయి. బరువు తగ్గడానికి, మీరు ఉదయం ఖాళీ కడుపుతో కివిని తినవచ్చు.

పుచ్చకాయలు:

పుచ్చకాయలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.వీటిలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

నారింజ:

నారింజలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అవి మీకు కడుపు నిండుగా అనిపించేలా సహాయపడతాయి, ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అరటిపండ్లు:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగు కదలికను సులభతరం చేస్తుంది. మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, అరటిపండు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అరటిపండు తినడం వల్ల కొవ్వు కరుగుతుంది.

అవోకాడో:

అవోకాడో తినే వ్యక్తులు తినని వారి కంటే తక్కువ బరువు ఉంటారు. అధిక కొవ్వు పదార్థం ఉన్నప్పటికీ, అవకాడోలు బరువు తగ్గడం, బరువు నిర్వహణను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

కాలానుగుణ పండ్లు:

పీచెస్, నెక్టరైన్లు రేగు వంటి పండ్లను స్టోన్ ఫ్రూట్ అంటారు. వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ కాలానుగుణ పండ్లను ఉదయం అల్పాహారంలో తీసుకున్నట్లయితే బరువు తగ్గించడంలో సహాయపడతాయి. చిప్స్, కుకీలు లేదా ఇతర ప్యాక్ చేసిన ఆహారాలకు మంచి ప్రత్యామ్నాయం.

Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget