Flax Seed Benefits: అవిసె గింజలు చేసే అద్భుతం తెలుసా? ఇలా 3 విధాలుగా తీసుకుంటే కొవ్వు మంచులా కరిగిపోతుంది!
Flax Seed Benefits: బరువు తగ్గడానికి అవిసె గింజలతో మూడు సులభమైన మార్గాలు. అవిసె గింజలు జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

Flax Seed Benefits పెరిగిన పొట్ట కరగదు, తరిగిన జుట్టు పెరగదు అని తరచూ వింటూ ఉంటాం. కానీ రెండింటికీ ఓ పరిష్కార మార్గం ఉంది. అదే అవిసె గింజలు. అవును ఇవి చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ చేసే అద్భుతం మాత్రం మీరు ఊహించలేరు. అందుకే దీన్ని వంటింట్లో ఉన్న దివ్యౌషధం అంటారు. ఒంట్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. తలపై తరిగిపోతున్న జుట్టును నిలబెడుతుందని అంటారు.
పొట్ట కొవ్వును తగ్గించుకోవడం ఈ రోజుల్లో అతిపెద్ద ఫిట్‌నెస్ సవాళ్లలో ఒకటిగా మారింది. జిమ్ముల్లో గంటల కొద్దీ చెమటలు చిందిస్తారు. రకరకాల డైట్ ప్లాన్స్ ప్రయత్నిస్తారు, కానీ ఫలితం చాలా వరకు అనుకున్నంత విజయం సాధించలేకపోతున్నారు. ఆలాంటి వాళ్లు ఓసారి ఈ అవిసె గింజలు ట్రై చేస్తే ఫలితం ఉండొచ్చు. పొట్ట కొవ్వును కరిగించడంలో ఈ గింజలు మీకు సహాయపడతాయి. అవిసె గింజలు పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడంలో మాత్రమే కాదు, శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడతాయి.
అవిసె గింజల పొడి
అవిసె గింజలను నేరుగా తినడం కష్టం, కాబట్టి వాటిని పొడి చేసి తీసుకోవడం కాస్త బాగానే ఉంటుంది. అందుకే వాటిని పొడి చేసి ఉపయోగించండి.
ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకొని, వాటిని తేలికగా వేయించి, పొడి చేసుకోండి.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వెచ్చని నీటితో దీన్ని తీసుకోండి.
ఇష్టమైతే, దీనిలో నిమ్మరసం, తేనె కలిపి రుచిని మెరుగుపరచుకోవచ్చు.
ఈ పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . రోజంతా జీవక్రియను చురుకుగా ఉంచుతుంది, దీనివల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది.
పెరుగుతో అవిసె గింజలు
పెరుగు, అవిసె గింజల కలయిక రుచికరంగా ఉండటమే కాదు, మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఇవి తిన్న తర్వాత పొట్ట నిండుగా ఉంటుంది. అంటే ఎక్కువ సమయం ఆకలిని తట్టుకోవచ్చు.
ఒక గిన్నె పెరుగు తీసుకొని, దానిలో ఒక చెంచా అవిసె గింజలు పొడి కలపండి.
ఇష్టమైతే, దీనిలో కొంత ఆపిల్ లేదా అరటిపండు ముక్కలు కూడా వేసుకోవచ్చు.
ఫైబర్ , ప్రోటీన్‌తో నిండిన ఈ స్నాక్స్ మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల మీరు ఎక్కువ తినే అవసరం లేకుండా చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
అవిసె గింజల డీటాక్స్ డ్రింక్
మీరు నిద్రపోతున్న టైంలో కూడా మీ జీవక్రియ స్మూత్‌గా, వేగంగా జరిగేలా చూసుకోవాలంటే ఈ అవిసె గింజలు దివ్యౌషధంలా పని చేస్తాయి. అందుకు డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక చెంచా అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
ఉదయం ఈ నీటిని వడకట్టి స్టోర్ చేసి పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు ఆ నీళ్లు తాగండి.
ఈ డీటాక్స్ డ్రింక్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పొట్ట కొవ్వు త్వరగా తగ్గుతుంది.
బరువు తగ్గడం ఏదో మాయాజాలం కాదు, కానీ సరైన పద్ధతులు. సహజ మార్గాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ మూడు సులభమైన, ప్రభావవంతమైన మార్గాల ద్వారా అవిసె గింజలను మీ రోజువారీ జీవితంలో చేర్చుకోండి. మీ కొవ్వు నెమ్మదిగా కరిగిపోతున్నట్లు చూడండి. అలాగే, మీరు దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే, పొట్ట ఎప్పుడూ బయటకు కనిపించదు!
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.





















