అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

జుట్టు రాలుతోందా? జాగ్రత్త, ఈ అనారోగ్యానికి అదే సంకేతం!

జుట్టు రాలడం కొన్ని ప్రత్యేక అనారోగ్యాలకు సూచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

మామూలుగా 30 సంవత్సరాల వయసుకు రాగానే జుట్టు రాలడమో, పొడవుగా పెరిగే సామర్థ్యం తగ్గడమో వంటివి కనిపిస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ అది మామూలే అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక అనారోగ్యాలకు సూచన ఈ లక్షణం అని నిపుణులు అంటున్నారు. అవేమిటో? ఎందుకో? ఇక్కడ తెలుసుకుందాం.

నిశితంగా గమనిస్తే చాలా త్వరగా మాడు మీది చర్మంలో మార్పులను గుర్తిస్తే టైప్ 2 డయాబెటిస్ ని త్వరగా గుర్తించవచ్చు అంటున్నారు వైద్యులు. టైప్ 2 డయాబెటిస్ చికిత్స తీసుకోకుండా వదిలేస్తే ప్రాణంతమైన జబ్బు. సమయానికి ముందే పసిగడితే సరైన చికిత్స, జీవనశైలిలో చిన్న మార్పులతో దీన్ని అదుపులో ఉంచవచ్చు. లేదంటే కంటి చూపు, కిడ్నీ సమస్యలు, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక పరిణామాలకు కారణం అవుతుంది.

జుట్టులో కనిపించే కొన్ని లక్షణాలు

  • కొత్తగా జుట్టు రాకపోవడం
  • జుట్టు త్వరగా పొడవు పెరగడం
  • తల మీద ఒక్కో భాగంలో జుట్టు పెరిగే తీరు ఒక్కో విధంగా ఉండడం

బోస్టన్ యూనివర్సిటికి చిందిన స్లోన్ ఎపిడెమెలజీ సెంటర్ 2019లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. దీని ప్రకారం డయాబెటిస్ తో బాధ పడుతున్న మహిళల్లో మాడు మీద జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అంటున్నారు.

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారిని నిశితంగా పర్యవేక్షిస్తే తల మధ్య మాడు మీద జుట్టు ఎక్కువగా రాలిపోవడం గమనిస్తే దానికి తగిన చికిత్స అందించవచ్చు అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆన్ విమెన్స్ జర్నోలో డాక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

హెయిర్ ఫాలికిల్స్‌లో జరిగే మార్పులు.. అనారోగ్యానికి మొదటి సంకేతమని 2016లో ప్రచురితమైన మరో అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఆక్సిజన్, పోషకాలను మోసుకెళ్లే ప్రసరణ వ్యవస్థలోని రక్తనాళాలు సమర్థవంతంగా పనిచెయ్యక పోవడం వల్ల జుట్టు ఫాలికిల్ లో మార్సు వస్తుంది. అందువల్ల ఫాలికిల్ కు నష్టం వాటిల్లుతుంది. ఫలితంగా జట్టు పలుచబడడం, వెంట్రుకలు తెగిపోవడం, పెరుగుదల తగ్గి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈరకమైన చిన్నచిన్న మార్పులు సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అందువల్ల గుర్తించరు కూడా. ఇలాంటి మార్పులను డెర్మటాలజిక్ టెక్నిక్స్ ఉపయోగించి నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు అని డెర్మటాలజిస్టులు అంటున్నారు.

హైపర్ గ్లైసిమియా, ఆండ్రోజెనెటిక్ అలోపెషియా, జుట్టు పలుచబడడం మధ్య సంబంధం ఉన్నట్టు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.

మీకు డయాబెటిస్ ఉందేమో అనే అనుమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరమనేది ముఖ్యమైన సూచన. ఈ అధ్యయనాలన్నీ కూడా స్కాల్ప్, డయాబెటిస్ మధ్య సంబంధం ఉందనే చెబుతున్నాయి.

ఇవి గమనించండి

టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిలో చాలా మందికి ఆవిషయం తెలియదు. కొన్ని శరీరక మార్పులను గమనించుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, ముఖ్యంగా రాత్రి పూట
  • ఎక్కువ దాహంగా ఉండడం
  • అలసటగా ఉండడం
  • ఎటువంటి ప్రయత్నంలేకుండానే బరువు తగ్గడం
  • జననాంగాల దగ్గర దురదగా ఉండడం, లేదా తరచుగా థ్రష్ బారిన పడడం
  • గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం
  • కంటి చూపు నాణ్యత తగ్గడం

వయసు 40 నలభై పైబడిన వారు , దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారైతే 25 పైబడిన వారు వారి శారీరక స్థితిని ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి. సమీప రక్త సంబంధీకుల్లో అధిక బరువు ఉన్నవారు లేదా డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఉన్నపుడు మరింత జాగ్రత్త అవసరం.

Also read: స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త మీ అందం కోల్పోవాల్సి వస్తుందేమో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget