Viral: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం
కొన్ని రెస్టారెంట్లు వినియోగదారులకు ఆకర్షించేందుకు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతాయి.
కొత్త కొత్త ఆహారప్రయోగాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. వాటిల్లో కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, విపరీతమైన ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఓ వంటకం సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతుంది. దాన్ని చూస్తుంటే తినాలనిపించడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లండన్లోని ప్రసిద్ధ సీఫుడ్ రెస్టారెంట్ ‘వెస్ట్రన్స్ లాండ్రీ’.ఇందులో కొత్తగా బాతు మెడ వంటకాన్ని వండారు. బాతు మెడలోంచి మాంసం మొత్తం తీసేసి అందులో ఆహారాన్ని స్టఫ్ చేసి వండిన వంటకం అంది. మెడ చివరన దారంతో కట్టేశారు. దీనికి ‘స్టఫ్డ్ డక్ నెక్’ అనే పేరు పెట్టారు. ఈ వంటకం వివరాలను ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.
‘ఏ భాగాన్ని వ్యర్థంగా పడేయకుండా ... మేము వండిన జంతువుల జీవితాలకు గౌరవాన్ని ఇవ్వాలన్నదే మా అభిప్రాయం. మా రంగంలో అవసరమైన భాగాలను తీసుకుని, మిగతావి పడేయడం వల్ల చాలా వ్యర్థాలు పేరుకుంటాయి. వాటిని వాడడం వల్ల మేము వండిన జంతువులకు విలువ ఇచ్చినట్టే’ అని చెపుకుంటోంది రెస్టారెంట్ యాజమాన్యం. వారు పోస్టు చేసిన వంటకం ఫోటో కొందరి నెటిజన్లకు వాంతులు తెప్పించేలా ఉంది. కాల్చిన బాతు మెడ, కళ్లు, ముక్కుతో పాటూ వడ్డించారు. దాన్ని తినాలో పడేయాలో తెలియక రెస్టారెంట్ కి వచ్చినవాళ్లు తికమకపడుతున్నారట.
ఈ బాతు మెడ వంటకం ఫోటోలు చూసిన ఒక నెటిజన్ ‘నాకు ఈ వంటకం చూశాక... నేను ఇన్నాళ్లు తిన్న జంతువులు ఎంత బాధపడ్డాయో అనిపిస్తోంది. నాన్ వెజ్ తినాలన్న ఆసక్తి పోయింది’ అని కామెంట్ చేసింది. మరొక నెటిజన్ ‘దీన్ని చూస్తుంటే తినాలని ఎలా అనిపిస్తుంది?’ అని రెస్టారెంట్ న్ ప్రశ్నించాడు. ఇంకా చాలమంది రకరకాలుగా స్పందించారు.
View this post on Instagram
Also read: ఎత్తుతోనే ఆత్మవిశ్వాసం... మంచి ఎత్తు పెరగాలంటే పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే
Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.